• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నోట్లో అమ‌ర్చిన ఆక్సిజ‌న్ స‌క్ష‌న్ పైప్ పేలి రోగి మృతి: కార‌ణం తెలిసి విస్తుపోయిన‌ డాక్ట‌ర్లు

|

లక్నో: చావు రాసి పెట్టి ఉంటే ఎలాగైనా క‌బ‌ళించి వేస్తుందంతే! త‌ప్పించుకోవ‌డం అసంభ‌వం. ఇది రుజువని నిరూపించే ఘ‌ట‌న ఇది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని అలీగ‌ఢ్‌లో చోటు చేసుకుంది. హ‌ర్‌దువా గంజ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని మొహ‌ల్లా న‌జీర్ గ్రామంలో నివ‌సించే 40 సంవ‌త్స‌రాల శీలాదేవి అనే మ‌హిళ కుటుంబ క‌ల‌హాల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింది. విషం సేవించింది.

వడ్డీ తగాదా: ప‌ండ్ల వ్యాపారి దారుణ‌హ‌త్య‌

ఆమె భ‌ర్త చ‌క్రేందు సింగ్‌తో ఆమెకు విభేదాలు ఉన్నాయి. మొహ‌ల్లా న‌జీర్ నుంచి త‌న స్వ‌గ్రామానికి బ‌య‌లుదేరిన ఆమె విష‌ప్ర‌భావానికి గురై మార్గ‌మ‌ధ్య‌లో అప‌స్మార‌క స్థితికి చేరుకుంది. ఆమెను గుర్తించిన స్థానికులు చ‌క్రేందు సింగ్‌కు స‌మాచారం ఇచ్చారు. సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న ఆయ‌న త‌న బంధువులు, ఇత‌ర కుటుంబీకుల‌తో క‌లిసి శీలాదేవిని అలీగ‌ఢ్‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క జేఎన్ వైద్య క‌ళాశాల‌కు త‌ర‌లించారు.

Woman Dies After Explosion In Mouth During Treatment At UP Hospital

ఆమెను పరీక్షించిన డాక్ట‌ర్లు.. విషాన్ని క‌క్కించ‌డానికి ఐసీయూలో ఉంచి చికిత్స ఆరంభించారు. ఊపిరి తీసుకోవ‌డం క‌ష్ట‌త‌రం కావ‌డంతో శీలాదేవికి స‌క్ష‌న్ పైప్ ద్వారా ఆక్సిజ‌న్ పంపించ‌బోయారు. ఆక్సిజ‌న్ స‌క్ష‌న్ పైప్‌ను నోట్లో అమ‌ర్చిన కొంత‌సేప‌టికి పెద్ద శ‌బ్దం చేస్తూ పైప్ ప‌గిలిపోయింది. అంతే! ఈ పేలుడులో ఫ‌లితంగా- శీలాదేవి త‌ల ఛిద్ర‌మైంది. అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించింది.

Woman Dies After Explosion In Mouth During Treatment At UP Hospital

ఈ ఘ‌ట‌న మొత్తం ఐసీయూలో అమ‌ర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న డాక్ట‌ర్ల‌ను నివ్వెర‌పోయేలా చేసింది. పేలుడు ఎలా సంభ‌వించింద‌నే విష‌యంపై ఆరా తీయ‌గా.. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి శీలాదేవి స‌ల్ఫ్యూరిక్ యాసిడ్‌ను తాగార‌ని తేలింది. నోట్లో అమ‌ర్చిన పైప్ స‌హ‌కారంతో ఆక్సిజ‌న్‌ను శ‌రీరంలోనికి పంపించిన వెంట‌నే- స‌ల్ఫ్యూరిక్ యాసిడ్ ర‌సాయ‌నిక చ‌ర్య‌కు గురై పేలుడు సంభ‌వించింద‌ని నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న డాక్ట‌ర్లను విస్తుపోయేలా చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a bizarre incident, a woman has died in Uttar Pradesh's Aligarh after an explosion in her mouth during treatment.The woman was brought to the J.N. Medical college in Aligarh on Wednesday evening after she allegedly consumed poison.As soon as the doctors began treatment and put the suction pipe in the mouth, an explosion took place which was recorded in the CCTV cameras. A team of doctors said that the woman, in all probability, had consumed sulphuric acid which after coming in contact with oxygen through the suction pipe exploded. A deeper research into the incident will reveal the exact cause, said the hospital spokesman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more