• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ మహిళ మహాముదురు: ఏకంగా పేటీఎం యజమానికే టెండరేసింది..కటకటాలపాలైంది

|

పేటీఎం...భారత్‌లో నివసిస్తూ ఉంటే ఈ పేరు తెలియని వారంటూ ఉండరూ. అంచలంచెలుగా ఎదిగిన ఈపేమెంట్ సంస్థ ఆ తర్వాత ఆన్‌లైన్ షాపింగ్‌లోకి కూడా అడుగులు వేసి తనదైన ముద్ర వేసుకుంది. నేడు ప్రముఖ ఈకామర్స్ సైట్స్‌కు గట్టిపోటీ ఇస్తోంది. అలాంటి ఈ సంస్థ వ్యవస్థాపకులు యజమాని అయిన విజయ్ శేఖర్ శర్మకే టోకరా వేయాలని చూశారు కొందరు. విజయ్‌కే టోపీ వేయాలని భావించింది బయటి వ్యక్తులు ఎవరో కాదు... ఆయన సంస్థలో పనిచేసే వ్యక్తులే అంటే ఇంటిదొంగలే ఆయన్ను ముంచే ప్రయత్నం చేశారు. చివరకు కటకటాలపాలయ్యారు.

కంపెనీ సమాచారం లీక్ చేస్తాం..రూ.20 కోట్లు ఇవ్వండి

కంపెనీ సమాచారం లీక్ చేస్తాం..రూ.20 కోట్లు ఇవ్వండి

ఈ వాలెట్ దిగ్గజం పేటీఎంలో ఇంటి దొంగలు బయటపడ్డారు. ఒక మహిళతో సహా మొత్తం ముగ్గురు వ్యక్తులు ఏకంగా పేటీఎం యజమాని విజయ్ శేఖర్ శర్మనే బ్లాక్ మెయిల్ చేశారు. అతని వ్యక్తిగత లాప్‌టాప్ నుంచి సమాచారం సేకరించామని రూ.20 కోట్లు చెల్లించకపోతే మొత్తం సమాచారంను బయటకు లీక్ చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్ చేశారు. ఈ మొత్తం సమాచారం దొంగలించింది ఒక మహిళ కాగా... ఆమెకు సహకరించింది ఆమె భర్త, పేటీఎం సంస్థలోనే పనిచేసే దేవంద్ర కుమార్ అనే మరో ఉద్యోగి.

ముంబై విమానాశ్రయం రన్‌వే మూసివేత...పలు విమానాలకు అంతరాయం ముంబై విమానాశ్రయం రన్‌వే మూసివేత...పలు విమానాలకు అంతరాయం

విజయ్ శేఖర్ శర్మ దగ్గర 10ఏళ్లుగా పనిచేస్తున్న మహిళ

విజయ్ శేఖర్ శర్మ దగ్గర 10ఏళ్లుగా పనిచేస్తున్న మహిళ

"నా సోదరుడు విజయ్ శేఖర్ శర్మ దగ్గర 10ఏళ్ల నుంచి ఆ మహిళ పనిచేస్తోంది. అతని వ్యక్తిగత ఫైళ్లకు సంబంధించి అన్ని పాస్‌వర్డ్‌లు ఆమెకు తెలుసు. ఆమె, ఆమె భర్త ఇద్దరు కంపెనీకి సంబంధించిన ప్రైవేట్, మరియు ఆక్థిక సమాచారాన్ని దొంగలించేందుకు కుట్రపన్నారు. సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవేంద్రకుమార్‌తో కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారు. అయితే కేవలం వ్యక్తిగత సమాచారం మాత్రమే వారు దొంగలించారని యూజర్ సమాచారానికి ఎలాంటి ఇబ్బంది లేదు" అని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, విజయ్ శేఖర్ శర్మ సోదరుడు అజయ్ శేఖర్ శర్మ తెలిపారు.

తరుచూ ఫోన్ చేస్తుండటంతో రూ.2 లక్షలు ఇచ్చాం

తరుచూ ఫోన్ చేస్తుండటంతో రూ.2 లక్షలు ఇచ్చాం

"మొదటి ఫోన్ సెప్టెంబర్ 20వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో వచ్చింది. నా సోదరుడు విజయ్ ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో నాకు ఫోన్ కాల్ వచ్చింది. రూ.20 కోట్లు ఇవ్వకుంటే తమ వద్ద ఉన్న సమాచారం లీక్ చేస్తామంటూ బెదిరించారు. ఇలా ఫోన్ కాల్స్ చేస్తూ ఉండగా చివరికి అక్టోబర్ 15న రూ.2 లక్షలు డబ్బును ఆన్‌లైన్ ద్వారా వారు ఇచ్చిన అకౌంట్ నంబర్‌కు బదిలీ చేశాము. ఆ తర్వాత మరో రూ.10 కోట్లు సిద్ధం చేసుకుని ఉండాల్సిందిగా మమ్మలను ఆదేశించాడు. వారి వద్ద ఎలాంటి సమాచారం ఉందో చెప్పాలంటూ అడిగాము. అప్పుడే మహిళా ఉద్యోగిణి, ఆమె భర్త, మరో ఉద్యోగి దేవేంద్రలు సమాచారాన్ని దొంగలించారని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు."అని అజయ్ వెల్లడించాడు. విషయం తెలిశాక సెక్టార్ 20 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు అజయ్.

ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని నోయిడా పోలీసులు అరెస్టు చేసినట్లు పేటీఎం సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఒక మహిళా ఉద్యోగిణి కూడా ఉన్నారని పేర్కొంది. ఈ మహిళ మరో ఇద్దరితో కలిసి పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ నుంచి డబ్బులు రాబట్టాలని చూశారని తెలిపింది.

English summary
The woman employee of Paytm founder and chief executive officer Vijay Shekhar Sharma, who had access to Sharma’s personal laptop, had allegedly stolen the data and was blackmailing him to cough up ₹20 crore, alleged the management of Paytm. Besides her, the other two arrested included her husband, a property dealer, and Devendra Kumar, another employee of Paytm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X