వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమార్తె మీద లైంగిక దాడి: చంపేస్తానని భార్యకు సెంట్రల్ జైలు నుంచి వార్నింగ్ ఇచ్చిన భర్త !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కుమార్తె మీద లైంగిక దాడి చేసిన వ్యక్తి జైలు నుంచి భార్యను చంపేస్తానని బెదిరించిన ఘటన బెంగళూరు నగరంలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భాదితురాలి ఫిర్యాదు మేరకు అశోక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

బెంగళూరు నగరంలోని ఆస్టిన్ టౌన్ లో అబ్దుల్ నబి ఖాన్, ఆయేషా ఖనం నివాసం ఉంటున్నారు. అబ్దుల్ నబి ఖాన్, ఆయేషా ఖనంకు ఓ కుమార్తె ఉంది. అబ్దుల్ నబి ఖాన్ కుమార్తె మీద కన్ను వేశాడు. ఆయేషా ఇంటిలో లేని సమయంలో కామాంధుడు అబ్దుల్ నబి ఖాన్ కుమార్తె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Woman filed complaint against her Husband about threatening her from jail in Bengaluru

విషయం గుర్తించిన ఆయేషా ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అబ్దుల్ నబి ఖాన్ ను అరెస్టు చేసి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. తనను జైలుకు పంపించిందని భార్య ఆయేషా మీద అబ్దుల్ నబి ఖాన్ కక్ష పెంచుకున్నాడు.

రెండు రోజుల క్రితం కుమార్తెను స్కూల్ నుంచి పిలుచుకుని ఇంటికి వెలుతున్న ఆయేషా దగ్గరకు నిందితుడు అబ్దుల్ నబి ఖాన్ సమీప బంధువు వెళ్లాడు. అనంతరం జైలు నుంచి మీ భర్త మాట్లాడుతున్నాడని ఆయేషాకు బలవంతంగా మొబైల్ ఫోన్ ఇచ్చాడు.

జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నిన్ను హత్య చేసి నా పగ తీర్చుకుంటానని, ఆ సమయంలో ఎంతో దూరంలో లేదని, జాగ్రత్తగా ఉండాలని నిందితుడు అబ్దుల్ నబి ఖాన్ భార్య ఆయేషాను హెచ్చరించాడని సమాచారం. తనకు ప్రాణహాని ఉందని ఆయేషా ఫిర్యాదు చెయ్యడంతో అశోక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
Woman filed complaint against her Husband about threatening her from jail in Bengaluru. He was arrested in sexual harassment case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X