చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య 'సీక్రెట్' ను బట్టబయలు చేశాడు : ఇంటర్ పాస్ కాకపోయినా..!

|
Google Oneindia TeluguNews

చెన్నై : తప్పు ఎవరు చేసినా తప్పే.. అయితే బంధుత్వం కారణంగానో, సాన్నిహిత్యం కారణంగానో కొన్ని తప్పులు వెనకేసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. తప్పని తెలిసినా వారించలేని స్థితిలో చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు. అయితే ఓ భర్త మాత్రం అలా వ్యవహరించలేదు. తన స్వార్థానికి నకిలీ డాక్టర్ అవతారమెత్తిన భార్య అసలు భాగోతాన్ని బయటపెట్టాడు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కార్తీక్, అర్చనలకు కొద్దిరోజుల క్రితం వివాహం జరిగింది. అయితే వైద్య వృత్తిలో కొనసాగుతోన్న తన భార్య అర్చనపై కార్తీక్ కు ఎందుకో అనుమానం తలెత్తింది. దీంతో తన భార్య నిజంగా వైద్యురాలేనా..? అని ఆరా తీయడం మొదలుపెట్టిన కార్తీక్ కు షాకింగ్ విషయాలు తెలిశాయి.

Woman flunks Class 12, forges, becomes doctor

అర్చన నకిలీ ధ్రువ పత్రాలతో వేరొకరి పేరు మీద డాక్టర్ గా కొనసాగుతున్నట్లు కార్తీక్ నిర్దారించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సంబంధించాడు. దీంతో ఇంటర్ కూడా పాస్ కానీ అర్చన నకిలీ డాక్టర్ భాగోతం వెలుగు చూసింది. అర్చన తండ్రి ఓ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి.

డాక్టర్ కావాలన్న కూతురు అర్చన కోరికను తీర్చడానికి తండ్రే నకిలీ పత్రాలు సృష్టించాడు. తమిజహరసి అనే వైద్యురాలు 2003లో చనిపోవడంతో.. ఆమె పేరు మీద అర్చన డాక్టర్ గా చలామణి అవుతోంది. సంతకాలను ఫోర్జరీ చేసేసి ఎవరికీ అనుమానం రాకుండా తన వైద్య వృత్తిని కొనసాగిస్తూ వస్తోంది అర్చన. అయితే విషయం భర్త కార్తీక్ కు తెలియడంతో మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు సెంథిల్ విషయాన్ని పోలీసుల ద్రుష్టికి తీసుకెళ్లడంతో.. క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

English summary
She had a medical degree, a licence to practice and all the relevant documents. What she didn't have is a pass mark in the Class 12 board examination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X