• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎంగేజ్‌మెంట్ పార్టీ అని పిలిచి .. హోటల్లో యువతితో మద్యం తాగించి .. ఆపై గ్యాంగ్ రేప్

|

మానవ మృగాలు రోజురోజుకీ రెచ్చిపోతున్నాయి. బాలికలు,మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. స్నేహితులను కూడా నమ్మలేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది . ఎంగేజ్‌మెంట్ పార్టీ ఇస్తానని పిలిచి ఓ 22 ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలోని అంధేరి కుర్లా రోడ్డు వద్ద ఉన్న హోటల్లో జరిగింది.

యూపీలో దారుణం .. ఇద్దరు మైనర్ బాలికలను చంపి ఫతేపూర్ చెరువులో పడేసిన దుండగులు యూపీలో దారుణం .. ఇద్దరు మైనర్ బాలికలను చంపి ఫతేపూర్ చెరువులో పడేసిన దుండగులు

యువతిపై ముగ్గురి గ్యాంగ్ రేప్ .. ముంబైలో దారుణం

యువతిపై ముగ్గురి గ్యాంగ్ రేప్ .. ముంబైలో దారుణం

ఎంగేజ్‌మెంట్ పార్టీ ఉందని స్నేహితులైన ముగ్గురమ్మాయిలను హోటల్ కి పిలిచిన యువకులు అందులో ఇద్దరమ్మాయిలు వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మాయిని ఉంచేసి ఆమెతో మద్యం తాగించారు. ఆపై ఆమె మత్తులో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు యువతి ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

నవంబర్ 8 న ముంబైలోని అంధేరి-కుర్లా రోడ్‌లోని ఒక హోటల్‌లో 22 ఏళ్ల యువతిని ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని, ఆమెను పార్టీకి ఆహ్వానించి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు ఆదివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బలవంతంగా మద్యంతాగించి సామూహిక అత్యాచారం

బలవంతంగా మద్యంతాగించి సామూహిక అత్యాచారం

తన పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు తనను తనతో పాటు మరో ఇద్దరు యువతులను పార్టీకి ఆహ్వానించారని, మిగతా అందరూ వెళ్లిపోవడంతో, తాను కూడా వెళ్ళిపోతాను అని చెప్పినా, తనను వెళ్లనివ్వకుండా ఆపి బలవంతంగా మద్యం తాగించి ముగ్గురు యువకులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
నిందితులను అవినాష్ పంగేకర్ (28), శిశిర్ (27), తేజస్ (25) గా ఆమె పేర్కొంది. గత వారం, సెంట్రల్ ముంబై నివాసి పంగేకర్ తన నిశ్చితార్ధం జరిగిన కారణంగా పార్టీ ఇస్తానంటూ స్నేహితులను హోటల్ కి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది .

పరారీలో ముగ్గురు నిందితులు .. ఆలస్యంగా ఫిర్యాదు చేసిన యువతి

పరారీలో ముగ్గురు నిందితులు .. ఆలస్యంగా ఫిర్యాదు చేసిన యువతి


ఎంగేజ్‌మెంట్ పార్టీకి పిలిచిన పంగేకర్ పార్టీలో పంగేకర్ తనను బలవంతంగా మద్యం తాగించాడని బాధితురాలు ఆరోపించింది. మిగతా ఇద్దరు యువతులు వెళ్లిపోయిన తర్వాత, అక్కడ ఉన్న ముగ్గురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.

తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు గుర్తించిన యువతి చాలా రోజులపాటు ఈ విషయం ఎవరికి వెల్లడించలేదు. చివరికి ఈ సంఘటనను తన కుటుంబ సభ్యులకు శనివారం వివరించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి ఆమెను సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.

కేసు నమోదు .. నిందితుల కోసం పోలీసుల గాలింపు

కేసు నమోదు .. నిందితుల కోసం పోలీసుల గాలింపు

ఈ కేసును ప్రస్తుతం హోటల్ ఉన్న ఏరియా సహార్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు చేస్తోంది.

యువతి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, 34 క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఆసుపత్రి నుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధితురాలిపై అత్యాచారం జరిగిందా లేదా అనేది ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. నిందితుల్ని పట్టుకోవడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని సహార్ పోలీస్ స్టేషన్ అధికారి చెప్తున్నారు.

English summary
A 22-year-old woman was allegedly gang-raped by three men, who invited her to a party, on November 8 at a hotel on Mumbai’s Andheri-Kurla road.The victim registered a complaint with the police on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X