చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక వీరెందుకు: విమానంలో మహిళకు పీరియడ్స్... సహాయం చేయని ఎయిరిండియా సిబ్బంది

|
Google Oneindia TeluguNews

ప్రముఖ ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో ప్రయాణం చేసిన ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మహిళకు ఇరెగ్యులర్ పీరియడ్స్ కావడంతో చాలా ఇబ్బంది పడింది. అయితే ఆ మహిళ విమానాశ్రయంలో ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొంది..? విమనాశ్రయంలో సిబ్బంది ఏం చేశారు..?

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన మహిళకు పీరియడ్స్

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన మహిళకు పీరియడ్స్

ఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న ఎయిరిండియా విమానం ఏఐ42లో ఈ మహిళ ప్రయాణం చేయాల్సి ఉంది. ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే మహిళకు పొత్తి కడుపులో నొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో వెంటనే ఎయిర్‌పోర్టులో ఉన్న వాష్‌రూంకు వెళ్లింది. అక్కడ శానిటరీ ప్యాడ్స్ కనిపించలేదు. ఇక బ్లీడింగ్ ఎక్కువ అవుతుండటంతో ఏమి చేయాలో మహిళకు తోచలేదు. అక్కడే ఉన్న ఓ పనిమనిషిని అడుగగా శానిటరీ ప్యాడ్స్ కోసం ఫార్మాకు వెళ్లాల్సిందిగా సూచించింది.

విమానంలో కానీ విమానాశ్రయంలో కానీ కనిపించని శానిటరీ ప్యాడ్స్

విమానంలో కానీ విమానాశ్రయంలో కానీ కనిపించని శానిటరీ ప్యాడ్స్

రైల్వే స్టేషన్లలో, బస్టాండుల్లో కూడా శానిటరీ మెషీన్లు పెడుతున్న ఈ రోజుల్లో విమానాశ్రయంలో లేకపోవడం చాలా దారుణమని మహిళ అన్నారు. ఇక ఫార్మసీ వెతికే లోనే ఆమెకు ఎయిరిండియా సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. విమానం బయలుదేరేందుకు ఐదు నిమిషాలు మాత్రమే ఉందని ఎక్కడున్నా సరే బోర్డింగ్ గేటు దగ్గరకు చేరుకోవాలని ఎయిరిండియా ప్రతినిధి చెప్పారు. ఫోనులో తన పరిస్థితిని వివరించింది మహిళ కానీ తనకేమీ తెలియదన్నట్లుగా చెప్పిన ప్రతినిధి వెంటనే రాకపోతే విమానం బయలుదేరుతుందని చెప్పారు. ఇక చేసేదేమీలేక అలానే బోర్డింగ్ గేటు దగ్గరకు పరుగులు తీసింది.

 విమాన సిబ్బంది నుంచి నిర్లక్ష్యమైన సమాధానం

విమాన సిబ్బంది నుంచి నిర్లక్ష్యమైన సమాధానం


ఇక విమానంలోకి వెళ్లి ఎయిర్ హోస్టస్‌ను శానిటరీ ప్యాడ్ కోసం అడిగింది మహిళ. అయితే తమ దగ్గర ఎలాంటి శానిటరీ ప్యాడ్లు లేవని చెప్పింది. ఇక తన సీటులోనే కూర్చున్న మహిళ అప్పటికే తను ధరించిన జీన్స్ ప్యాంటు రక్తపు మరకలతో తడిసిపోయిందని చెప్పింది. తను పొందుతున్న ఆవేదన గమనించిన మరో మహిళా ప్రయాణికురాలు తన వద్ద ఉన్న శానిటరీ ప్యాడ్స్‌లో ఒకటి తీసి ఇచ్చింది. దీంతో ఆ మహిళ మనస్సు నెమ్మదించింది.

చెక్‌లిస్టులో భాగంగా శానిటరీ ప్యాడ్స్‌ను విమానంలో ఉంచుతాం

చెక్‌లిస్టులో భాగంగా శానిటరీ ప్యాడ్స్‌ను విమానంలో ఉంచుతాం

మహిళల కోసం శానిటరీ ప్యాడ్స్ ఎందుకు అరేంజ్ చేయలేదని ఎయిర్‌పోర్టు పీఆర్ ప్రవీణ్ భట్నాగర్‌ను ప్రశ్నించగా అటువంటిదేమీ ఉండదని చెక్ లిస్టులో భాగంగా విమానంలో శానిటరీ ప్యాడ్స్ కూడా పెట్టాలనేది నిబంధనగా ఉందని తెలిపారు. తమ క్యాబిన్ సిబ్బందికి ఒక్క వడ్డించడంలోనే శిక్షణ ఇవ్వమని... అత్యవసర పరిస్థితుల్లో కూడా మెడికల్‌గా ఎలా రియాక్ట్ అవ్వాలో అనేదానిపై కూడా శిక్షణ ఇస్తామని భట్నాగర్ చెప్పారు.

English summary
A Woman who was travelling from Delhi to Chennai in AirIndia flight faced an odd situation. She had her periods at an irregular time where the air india staff could not be of any help to her as she did not carry a sanitary pad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X