• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాళ్లు చేతులు కట్టేసి.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. సినీ ఫ‌క్కీలో మ‌ర్డ‌ర్ ప్లాన్ చేసిన హీరో..

|

అతనో యాక్టర్. కన్నడ సినిమాల్లో హీరోగా ట్రై చేస్తున్నాడు. తన నటనతో ఓ అమ్మాయిపై వలపు వల విసిరాడు. అప్పటికే పెళ్లైన విషయం దాచి రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసి యువతి నిలదీయడంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. అయితే చివరి నిమిషంలో కథ అడ్డం తిరిగింది. పోలీసుల ఎంట్రీతో చిప్పకూడు తింటున్నాడు.

టిక్‌టాక్ ఎంత పనిచేసింది.. వీడియోలు వద్దన్నందుకు...

రంగుల కలలు చూపి రెండో పెళ్లి

రంగుల కలలు చూపి రెండో పెళ్లి

కర్నాటకకు చెందిన శబరీష్ శెట్టి శాండిల్‌వుడ్ నటుడు. నటనపై ఆసక్తితో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. అతను హీరోగా నటించిన అరుణ్, జనన అనే చిత్రాల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న పద్మశ్రీ అనే యువతి పరిచయమైంది. ఆమెతో చనువు పెంచుకున్న శబరీష్.. ఇండస్ట్రీలో పెద్ద హీరోలు, నిర్మాతలు తెలుసని చెప్పి వారితో దిగిన ఫొటోలు చూపించాడు. రంగుల కలలు చూపి పద్మశ్రీని ప్రేమలోకి దింపాడు. కొన్నాళ్లకు ఆమెను రెండో పెళ్లి చేసుకుని కేఆర్‌పురం శివార్లలోని భట్టరహళ్లిలో కాపురం పెట్టాడు.

అనుమానంతో ఆరా

అనుమానంతో ఆరా

కొద్ది రోజులుగా శబరీష్ ప్రవర్తన మారడంతో పద్మశ్రీకి అనుమానం వచ్చింది. ఆరా తీయగా తీగ లాగితే డొంక కదిలింది. శబరీష్‌కు గతంలోనే మరో మహిళతో వివాహమైందని తెలియడంతో ఆమె అతన్ని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో రెండో భార్యను అడ్డు తొలగించుకోవాలని శబరీష్ నిర్ణయించుకున్నాడు. ఆమెను అంతమొందించేందుకు పక్కా ప్లాన్‌ రెడీ చేసుకన్నాడు.

స్నేహితుడు రావడంతో...

స్నేహితుడు రావడంతో...

ప్లాన్‌లో భాగంగా ఐదుగురు స్నేహితలను ఇంటికి పిలిపించిన శబరీష్ భార్య కాళ్లు, చేతులు కట్టేసి రెండు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. అయితే ఆమెను హత్య చేద్దామనుకునే లోపు అదృష్టవశాత్తూ పద్మశ్రీ స్నేహితుడు అక్కడకి వచ్చాడు. జరుగుతున్న వ్యవహారం చూసి కేఆర్‌పురం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు శబరీష్‌తో పాటు మరో నిందితున్ని అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురు పరారవడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. మత్తు ఇంజెక్షన్ల కారణంగా స్పృహ కోల్పోయిన పద్మశ్రీని ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A case has been registered against shabareesh Shetty for allegedly plan to kill his wife, shabhareesh is a budding sandalwood actor. he has been arrested on charges of assulting, abduction, attempt to murder and administering anaesthesia.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more