వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తతో విడిపోయినా.. మహిళలకు అత్తవారింట్లో వుండే హక్కు .. సుప్రీం తాజా తీర్పు

|
Google Oneindia TeluguNews

భర్త నుంచి విడిపోయిన మహిళలకు సుప్రీం ధర్మాసనం ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. భర్త నుంచి విడిపోయిన మహిళలు అత్త వారింట్లో ఉండడానికి అన్ని హక్కులను కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. తన జీవిత భాగస్వామితో కలిసి జీవించకుండా దూరంగా ఉంటున్న మహిళకు, అత్తవారింట్లో ఉండే హక్కు ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

 గృహహింస చట్టం ప్రకారం భర్తతో విడిపోయినా అత్తవారింట్లో ఉండే హక్కు

గృహహింస చట్టం ప్రకారం భర్తతో విడిపోయినా అత్తవారింట్లో ఉండే హక్కు

భర్తతో విడిపోయినంత మాత్రాన అత్తవారింటితో సంబంధం తెగిపోయినట్లు కాదని, ఆమె అత్తవారింట్లో నివసించవచ్చు అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. గృహహింస చట్టం ప్రకారం భర్త నుండి విడిపోయిన మహిళలకు ఆ హక్కు ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎం ఆర్ షా ఓ కేసులో కీలక తీర్పునిచ్చారు.

దేశంలో రోజురోజుకు గృహహింస పెరిగిపోతోందని, ప్రతిరోజు మహిళలు ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

ఓ కేసులో కోడలు ఇంట్లో ఉండొద్దని కోర్టుకెక్కిన మామ .. పిటీషన్ కొట్టేసిన సుప్రీం

ఓ కేసులో కోడలు ఇంట్లో ఉండొద్దని కోర్టుకెక్కిన మామ .. పిటీషన్ కొట్టేసిన సుప్రీం


జీవితకాలమంతా కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, భాగస్వామిగా ఇలా రకరకాల పాత్రలు పోషించే మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. గృహహింస చట్టం ప్రకారం మహిళలు భర్తతో కలిసి ఉన్నప్పటికీ అత్తవారింట్లో నివసించే హక్కు కలిగి ఉంటారని సర్వోన్నత న్యాయస్థానం ఓ తీర్పులో స్పష్టం చేసింది.

భర్తతో విడిపోయినప్పటికీ కోడలు తన ఇంట్లోనే ఉంటుందంటూ కోర్టుకెక్కిన ఓ వ్యక్తి కేసు విషయంలో 2009లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సతీష్ చందర్ అహుజా దాఖలు చేసిన అప్పీల్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.

తన ఆస్తిలో తన కొడుక్కే హక్కు లేదని , కోడలికి హక్కు ఎలా ఉంటుందని వాదన

తన ఆస్తిలో తన కొడుక్కే హక్కు లేదని , కోడలికి హక్కు ఎలా ఉంటుందని వాదన

రవీన్ అహుజా అనే వ్యక్తి తన భార్య స్నేహ అహుజాకు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే తన కుమారుడితో విడాకులు తీసుకుంటున్న కోడలు తన ఇంట్లో ఉండడం పై అభ్యంతరం వ్యక్తం చేసిన రవీన్ అహుజా తండ్రి సతీష్ చందర్ అహుజా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కోడలు నివాసం ఉంటున్న ఆస్తి తన స్వయంగా సంపాదించుకున్న ఆస్తి అని, తన కుమారుడికి ఆ ఆస్తిలో వాటా లేదని, అలాంటప్పుడు తన కోడలు ఎలా హక్కు ఉంటుందంటూ సతీష్ అహుజా కోర్టుకెక్కారు.

Recommended Video

COVID-19 : కరోనా మరణాలను తగ్గించడంలో Remdesivir ప్రభావం లేదన్న WHO || Oneindia Telugu
ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం ధర్మాసనం .. మహిళలకు ఆ హక్కు ఉందని స్పష్టం

ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం ధర్మాసనం .. మహిళలకు ఆ హక్కు ఉందని స్పష్టం

అయితే ఢిల్లీ హైకోర్టు సదరు యువతి అత్తవారింట్లో ఉండేందుకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మళ్లీ సతీష్ అహుజా సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం గృహహింస చట్టం ప్రకారం సెక్షన్ 2, మరియు సెక్షన్ 17 నిబంధనల మేరకు భర్తతో విడిపోయినప్పటికీ అత్తవారింట్లో ఉండడానికి మహిళలకు హక్కు ఉందని స్పష్టం చేసింది. సతీష్ అహుజా దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

English summary
A woman can stay in her husband's family home even if she is estranged from him, the Supreme Court said , overruling its earlier decision to the contrary. An estranged daughter-in-law cannot be evicted by her husband or family members and she has a right to stay there under the Domestic Violence Act, said the bench of Justices Ashok Bhushan, R Subhash Reddy and MR Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X