వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతిని, బాయ్‌ఫ్రెండ్‌ని చావబాదిన పోలీస్‌లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరీ పోలీసు స్టేషన్‌లో ఓ యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్‌ను పోలీసులు వేధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. నవంబర్ 1వ తేదీన ఆ జంటను పోలీసులు వేధించారు.

వారిద్దరు కూడా బాగా తాగి నడి రోడ్డు పైన గొడవకు దిగారని పోలీసులు చెబుతున్నారు. దీంతో వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చిన ఆ యువతిని, బాయ్ ఫ్రెండ్‌ను నలుగురైదుగురు పోలీసులు వేధించిన వీడియో సంచలనం రేపుతోంది.

పోలీసులు ఆ యువతిని రక్తం వచ్చేదాకా కొట్టారని తెలుస్తోంది. ఓ మహిళా పోలీస్ అధికారి యువతి పైన దారుణంగా చేయి చేసుకుందని సమాచారం. యువకుడ్ని కూడా కొట్టారు. వారు కొడుతుండగా యువతి, బాయ్ ఫ్రెండ్ కేకలు పెట్టారు.

Woman, her friend allegedly assaulted by cops at Andheri station

రోడ్డు పైన ఆ యువతి, యువకుడు తాగి పోలీసు స్టేషన్ ఎదుటనే దెబ్బలాడుకుంటున్న సమయంలో, ఓ కానిస్టేబుల్ ఆ అమ్మాయిని ఉద్దేశించి... అతను ఏమైనా వేధిస్తున్నాడా అని అడిగాడు.

దానికి ఆమె, తమ వ్యక్తిగత విషయమని, ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పిందని తెలుస్తోంది. దీంతో యువతిని, బాయ్ ఫ్రెండ్‌ను స్టేషన్లోకి తీసుకు వెళ్లి వేధించారని సమాచారం. బాధితులు ఇద్దరు కూడా ఓ కాల్ సెంటర్లో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
An FIR has been lodged against the constables of the Andheri Police station after a video went viral in which the men in uniform were seen abusing and beating a young couple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X