• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లవర్‌ను చంపి బిర్యానీ వండింది...ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా?

|

నేరాలు చేయడం లేదా మనుషులను చంపడంలో చాలా మంది కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. తాము నేరం చేశాక పోలీసులకు దొరక్కుండా కొత్త తరహా ఎత్తులు వేస్తున్నారు నేరస్తులు. ఇందుకోసం టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నారు. నేరాలు చేయడం పోలీసుల కళ్లు కప్పి ధైర్యంగా సమాజంలో తిరగడం...ఇదీ వీరు చేస్తున్న పని. కానీ ఇప్పుడు చదవబోయేది తెలుసుకుంటే మీరు షాక్ అవడం తథ్యం. ఎందుకంటే నేరాలు చేసి తప్పించుకోవడంలో పురుషులే కాదు... మహిళలు కూడా తమ మెదడును ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసా..?

ఏడేళ్లు ప్రేమించుకున్నారు..హ్యాండిచ్చాడు

ఏడేళ్లు ప్రేమించుకున్నారు..హ్యాండిచ్చాడు

అది మొరాకో దేశం. అందులో నివసిస్తున్న ఓ యువతి ఒక వ్యక్తితో ఏడేళ్లుగా ప్రేమలో మునిగి తేలింది. ఆ వ్యక్తి కూడా ఈ అమ్మాయిని అదే స్థాయిలో ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. ఇంతవరకు బాగానే ఉంది స్టోరీ. సినిమాలో చూపించినట్లుగానే ప్రేమించిన అమ్మాయిని కాకుండా ఆ అబ్బాయి మరో అమ్మాయిని వివాహం చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అయితే ఇక్కడే బెడిసి కొట్టింది. తనను ఏడేళ్ల పాటు ప్రేమించి ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవడం ఆ అమ్మాయి జీర్ణించుకోలేకపోయంది. తన ఇంటికి ఆ వ్యక్తిని పిలిపించుకుంది.

 ప్రియుడిని చంపి నోరూరించే బిర్యానీ వండింది

ప్రియుడిని చంపి నోరూరించే బిర్యానీ వండింది

తన మాజీ ప్రియురాలు ఆహ్వానం మేరకు ఇంటికి వెళ్లాడు ఆ వ్యక్తి. ఇంత వరకు బాగానే ఉంది స్టోరీ. ఇద్దరు బాగానే మాట్లాడుకున్నారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. అప్పటికే తన ప్రియుడిని చంపాలని డిసైడ్ అయిపోయిన యువతి అతన్ని మాట్లల్లోకి దింపి ముగ్గులోకి లాగి ఒకే ఒక కత్తి పోటుతో చంపేసింది. ఆ తర్వాత ఆమె ఏమి చేసిందో తెలిస్తే ఒళ్లు గొగుర్పాటుకు గురువుతుంది. కత్తిపోటుకు మృతి చెందిన ప్రియుడిని మరింత చిన్న ముక్కలుగా కోసి మసాలా బాగా దట్టించి బిరియాని చేసింది. అదే బిరియానిని తన ఇంటి దగ్గరే పనిచేస్తున్న కొంతమంది పాకిస్తానీయులను తన ఇంటికి ఆహ్వానించి వడ్డించింది. వారు వెళుతూ వెళుతూ బిరియాని బాగుందంటూ కితాబిచ్చారు.

పోలీసులకు ఎలా దొరికిందంటే..?

పోలీసులకు ఎలా దొరికిందంటే..?

ఇక ప్రియురాలి ఇంటికి వెళుతున్నట్లు తన సోదరుడితో చెప్పి వెళ్లిన మృతుడు ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో అతని కోసం వెతుకుతూ వెళ్లాడు సోదరుడు. ముందుగా ఆ యువతి ఇంటికి వెళ్లాడు. అయితే ఇంటికి వచ్చాడు కానీ అతన్ని తన్ని బయటకు తరిమినట్లు సమాధానం చెప్పింది. మళ్లీ ఇతర చోట్ల తన సోదరుడికోసం వెతికాడు. ఆచూకీ దొరక్క పోవడంతో మళ్లీ ఆ యువతి ఇంటికి వెళ్లాడు. ఎందుకో అనుమానం ఉందని చెప్పి ఇంట్లో బిరియానీ చూడగా అందులో తన సోదరుడి పన్ను కనిపించింది. ఇదే ఆ కిలేడీని పట్టించింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుడి సోదరుడు. డీఎన్ఏ టెస్టు చేయగా అసలు విషయం బయటపడింది. ఎట్టకేలకు తన ప్రియుడిని తానే చంపి బిర్యానీ చేసినట్లు ఒప్పుకుంది నిందితురాలు.

English summary
A woman has been accused of killing her lover then cooking his remains as part of a traditional rice dish, according to reports.The Moroccan woman, who has not been named, allegedly butchered her boyfriend before serving his remains to nearby workers as 'machboos' - a Gulf dish similar to biriyani.Local reports, quoting the man's brother, said police found a human tooth inside the woman's blender.The woman was arrested after DNA tests showed it was the man's tooth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X