వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది విన్నారా ? లవ్: ముహూర్తం చీరకు అంచు బాగలేదని పెళ్లి నిలిపేసిన పెళ్లి కుమార్తె, ఇంత పొగరా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హాసన్: పెళ్లి కుమారుడు నచ్చలేదనో, లేక కట్నం కోసం పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారనో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే పెళ్లి ముహూర్తానికి అందమైన, ఖరీదైన చీర తీసుకురాలేదనే చిన్ని విషయంలో తనకు ఈ పెళ్లి వద్దు అంటూ పెళ్లి కుమార్తె రివర్స్ తిరగడంతో పెళ్లికి వచ్చిన వారు హడలిపోయారు. చేసేది లేక పెళ్లికి వచ్చిన పెద్దలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పెళ్లి ఆగిపోయింది.

సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!

ప్రేమికులు

ప్రేమికులు

కర్ణాటకలోని హాసన్ తాలుకా బిదరికెరె గ్రామంలో రఘకుమార్ అనే యువకుడు, సంగీత అనే యువతి నివాసం ఉంటున్నారు. రఘకుమార్, సంగీత ఒకే గ్రామంలో నివాసం ఉండటంతో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఒకరినివిడచి ఒకరు ఉండలేమని, పెళ్లి చేసుకుంటామని వారి తల్లిదండ్రులకు చెప్పారు.

మీ సంతోషమే మా సంతోషం

మీ సంతోషమే మా సంతోషం

రఘుకుమార్, సంగీత ప్రేమ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాల పెద్దలు మీరు సంతోషంగా మా కళ్ల ముందే ఉంటామంటే మేము ఎందుకు కాదంటాం చెప్పండి అని ఇద్దరికి చెప్పారు. రఘుకుమార్, సంగీత కుటుంబ సభ్యులు వారి బంధువులతో సంప్రధించి ఈనెల 6వ తేదీన పెళ్లి ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

పెళ్లి సంప్రధాయాలు

పెళ్లి సంప్రధాయాలు

పెళ్లి కుమార్తె సంగీత పెళ్లి ముహూర్తానికి, పెళ్లికి కట్టుకోవాలసి చీరలను పెళ్లి కుమారుడు రఘుకుమార్ కుటుంబ సభ్యులు తీసుకు వచ్చారు. పెళ్లికి ముందు జరగవలసిన పసుపు, కుంకుమలు ఇచ్చిపుచ్చుకుని పెళ్లి పసుపుతో పెళ్లి కుమార్తెకు మంగళ స్నానాలు చేయించారు. వాటితో పాటు సంప్రధాయంగా జరగవలసిన అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. మరుసటి రోజు పెళ్లి ముహూర్తం జరగవలసి ఉంది.

ఛండాలం చీర తెస్తారా ?

ఛండాలం చీర తెస్తారా ?

పెళ్లి కుమార్తె సంగీత పెళ్లి ముహూర్తానికి కట్టుకోవలసిన చీర (ముహూర్తం చీర) తీసుకెళ్లిన రఘుకుమార్ కుటుంబ సభ్యులు పెళ్లి కుమార్తెకు ఇచ్చారు. తరువాత చీర పరిశీలించిన పెళ్లి కుమార్తె సంగీతకు మండిపోయింది. ముహూర్తానికి కట్టుకోవలసిన చీర చాల ఛండాలంగా ఉందని, అసలు చీరకు ఉండవలసిన బార్డర్ (అంచులు) ఏమైనా సక్రమంగా ఉందా ? అంటూ పెళ్లి కుమారుడు రఘుకుమార్ కుటుంబ సభ్యులను ప్రశ్నించింది.

ఇప్పుడే ఇంత పొగరా ?

ఇప్పుడే ఇంత పొగరా ?

పెళ్లి ముహూర్తం అయిపోయిన తరువాత మరో చీర కావాలంటే తీసిస్తామని, ఇంత చిన్న విషయానికి పెద్ద గొడవలు ఎందుకని రఘుకుమార్ కుటుంబ సభ్యులు సంగీతకు చెప్పారు. అయితే తనకు పెళ్లి ముహూర్తం చీర నచ్చలేదని, ఈ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని సంగీత తేల్చిచెప్పింది. పెళ్లికి ముందే నీవు ఇంత పొగరుగా మాట్లాడుతున్నావంటే ఇక పెళ్లి తరువాత మమ్మల్ని లెక్క చెయ్యవని రఘకుమార్ కుటుంబ సభ్యులు మండిపడ్డారు.

ఇలాంటి కోడలు మా ఇంటికి వద్దు !

ఇలాంటి కోడలు మా ఇంటికి వద్దు !

చీర విషయంలో గొడవ పెద్దది కావడంతో సంగీతను ఇంటి కోడలిగా చేసుకోవడానికి రఘుకుమార్ కుటుంబ సభ్యులు నిరాకరించారు. పెళ్లి చీర విషయంలో సంగీత వెనక్కి తగ్గకపోవడంతో పెళ్లికి వచ్చిన పెద్దలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెళ్లి కోసం తాము ఖర్చు చేసిన మొత్తం డబ్బులు సంగీత కుటుంబ సభ్యులను నుంచి ఇప్పించాలని, తమకు న్యాయం చెయ్యాలని రఘుకుమార్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి పంచాయితీ చేశారు. మొత్తం మీద పెళ్లి చీరకు అంచులు బాగాలేదని పెళ్లి నిలిచిపోవడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Woman marriage has stopped near Haasan in karnataka due to brides saree is not nice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X