వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

monica malik: లేడీ కాదు కేడీ.. 10 ఏళ్లలో 8 మందితో పెళ్లి.. నగదు/ నగలతో ఉడాయింపు..

|
Google Oneindia TeluguNews

ఆమె లేడీ కాదు కేడీ.. సీనియర్ సిటిజన్లే లక్ష్యం.. నమ్మించి, మాయమాటలు చెబుతోంది. మనువాడుతోంది. తీరా.. నగదు, నగలు తీసుకొని ఉడాయిస్తోంది. గత పదేళ్లలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 8 మందిని ఇలానే పెళ్లి చేసుకొని.. ఛీట్ చేసింది. ఇటీవల ఓ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్‌ను ఇలా చేయడంతో మాయాలేడీ మోసాలు వెలుగుచూశాయి. గత చరిత్ర బట్టబయలయ్యింది.

సినీఫక్కీలో మోసాలు..

సినీఫక్కీలో మోసాలు..

బాలీవుడ్‌లో లూటెరీ దుల్హన్ అనే సినిమాలో ఇలానే పెళ్లి చేసుకొని.. చీట్ చేస్తుంటారు. దానిని ఓ మహిళ అనుసరించింది. ఎనిమిదో వ్యక్తి కన్ స్ట్రక్షన్ కాంట్రాక్టర్‌ను మోసం చేసింది. 66 ఏళ్ల ఆ వ్యక్తి.. మాయలేడీ వలలో పడ్డాడు. కొద్దిరోజుల తర్వాత రూ. 15 లక్షల నగదు తీసుకొని ఉడాయించింది. దీంతో అతను మోసపోయానని గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని బలహీనతను మహిళ క్యాష్ చేసుకుంది.

కిశోర్‌ను ఛీట్..

కిశోర్‌ను ఛీట్..


ఘజియాబాద్ కవినగర్‌కి చెందిన జుగల్ కిశోర్ అనే కాంట్రాక్టర్.. ఒంటరిగా ఉంటున్నాడు. ఏడాది క్రితం అతని భార్య చనిపోయింది. అతనికి కుమారుడు ఉన్నాడు.. కానీ వేరుగా ఉంటున్నాడు. దీంతో ఢిల్లీకి చెందిన మ్యాట్రిమోనీ ఏజెన్సీ ఖన్నా వివాహ్ కేంద్రాన్ని కిశోర్ పేపర్‌లో చూశాడు. సీనియర్ సిటిజన్లకు, విడాకులు తీసుకున్న వారికి పెళ్లి చేస్తామని అందులో ఉంది. దీంతో అతను ఏజెన్సీని సంప్రదించాడు. దీంతో ఏజెన్సీ ఓనర్ మంజు ఖన్నా.. మోనికా మాలిక్‌ను పరిచయం చేశాడు. అతనికి ఆమె కరెక్టుగా సరిపోతుందని పేర్కొన్నారు. మోనికా.. కూడా తనకు పెళ్లైందని.. విడాకులు తీసుకున్నానని చెప్పింది. దీంతో వీరి వివాహం గతేడాది ఆగస్టులో జరిగింది.

రెండు నెలల తర్వాత పరార్..

రెండు నెలల తర్వాత పరార్..

కవినగర్‌లోని ఇంటి వద్ద మోనికా-కిశోర్ ఉంటున్నారు. కానీ కొద్దిరోజులే బాగున్నారు. రెండు నెలల తర్వాత మోనికా ఆభరణాలు, నగదు తీసుకొని ఇంటినుంచి వెళ్లిపోయింది. గతేడాది అక్టోబర్ 26వ తేదీన మోనిక రూ.15 లక్షల విలువ గల ఆభరణాలతో వెళ్లిపోయిందని ఓ ఇంగ్లిష్ పత్రిక రిపోర్ట్ చేసింది. తర్వాత కిశోర్.. మ్యాట్రిమోని ఏజెన్సీని సంప్రదించాడు. విషయం తెలియజేయగా.. కిశోర్‌ని బెదిరించడం ప్రారంభించారు.

Recommended Video

Coronavirus : Watch IAF's C-17 Globemaster Lands With Indian Pilgrims From Iran
ఏజెన్సీ పాత్ర.. పోలీసులకు ఫిర్యాదుతో వెలుగులోకి..

ఏజెన్సీ పాత్ర.. పోలీసులకు ఫిర్యాదుతో వెలుగులోకి..


మోనికా మాజీ భర్త గురించి తెలుసుకోవడంతో పాటు.. ఏజెన్సీ చేస్తున్న మోసాన్ని గుర్తించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు విచారణ చేయగా.. ఇలా ఇప్పటివరకు 8 మందిని మోసం చేసిందని బయటపడింది. గత పదేళ్లలో పెళ్లి చేసుకొని.. కొద్దిరోజులు ఉండి, వచ్చేసేదని తెలిపారు. నగదు/ నగలతో బయటపడేదని పేర్కొన్నారు. అయితే ఆమె పెళ్లిళ్లు అన్నీ కూడా ఖన్నా వివాహ కేంద్రంలో నిశ్చయం కావడంతో.. మోసంలో వీరి పాత్ర కూడా ఉంది అని అర్థమవుతోంది. దీంతో పోలీసులు మోనికా, మ్యాట్రిమోని ఏజెన్సీపై చీటింగ్, కుట్ర కింద కేసు నమోదు చేశారు.

English summary
monica malik:woman monica cheated by construction contractor, identified as Jugal Kishore, is a resident of Ghaziabad’s Kavi Nagar locality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X