వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త వెళ్లగానే ఫోన్, ఇంట్లోనే ప్రియుడితో రాసలీలలు: రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేశారు

కట్టుకున్న భర్త ఇంట్లో లేని సమయంలో తన ప్రియుడితో శృంగార కార్యకలాపాలు సాగిస్తున్న ఓ మహిళ వ్యవహారం బయటపడింది. దీంతో ఇరుగుపొరుగువారు, బంధువులు, గ్రామస్తులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

|
Google Oneindia TeluguNews

పాట్నా: కట్టుకున్న భర్త ఇంట్లో లేని సమయంలో తన ప్రియుడితో శృంగార కార్యకలాపాలు సాగిస్తున్న ఓ మహిళ వ్యవహారం బయటపడింది. దీంతో ఇరుగుపొరుగువారు, బంధువులు, గ్రామస్తులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత చెట్టుకు కట్టేసి ఇద్దర్నీ చితకబాదారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది.

గత మూడేళ్లుగా సదరు మహిళ సాగిస్తున్న ఈ వివాహేతర సంబంధం గత బుధవారం బయటపడింది. ఇంట్లో భర్త లేని సమయంలో ప్రియుడితో ఏకాంతంగా వివాహిత ఉండటాన్ని గమనించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు గ్రామస్తులు. స్థానిక గోపీనాథ్‌పూర్ గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు దాదాపు 20గంటలపాటు బంధించారు.

 Woman, paramour tied to tree, beaten up on panchayat orders in Bihar

భారీగా చేరుకున్న జనం సదరు మహిళతోపాటు ప్రియుడ్ని చెట్టుకు కట్టేసి చితకబాదారు. కాగా, ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిద్దరిని కాపాడారు. ఈ ఘటనపై 2 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు డీఎస్పీ కృష్ణ మురళీ తెలిపారు.

వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో ఐదుగురు గ్రామస్తులపై, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు మహిళతోపాటు ఆమె ప్రియుడిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, 30ఏళ్ల ఈ మహిళ పక్క జిల్లా సీతామర్షికి చెందిన 27ఏళ్ల యువకుడితో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

అంతేగాక, తన ప్రియుడితోనే జీవించాలని కోరుకుంటున్నట్లు సదరు మహిళ తెలిపిందని డీఎస్పీ తెలిపారు. ఆమెకు ఎనిమిదేళ్ల కిందటే వివాహమైనా.. గత మూడేళ్ల నుంచి ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని చెప్పారు. భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోగానే ఆమె పోన్ చేస్తుందని, వెంటనే అతడు ఆమె వద్దకు చేరుకుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు.

English summary
A married woman and her paramour were tied to a tree and mercilessly beaten up, allegedly on the orders of a village panchayat in north Bihar’s Muzaffarpur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X