వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైరల్: వర్షపునీటిలో ఫ్యాషన్ టెకీ ఫోటోషూట్..

|
Google Oneindia TeluguNews

భారీ వర్షాలతో ఉత్తర భారత చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా గుజరాత్, బీహర్‌లో వర్ష బీభత్స కొనసాగుతుంది. దీంతో పాఠశాలలకు మంగళవారం వరకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాట్నాలో ఆసుపత్రులు, ఇళ్లలోకి భారీగా వర్షపునీరు చేరిన సంగతి తెలిసిందే. దీంతో జాతీయ విపత్తు నిర్వహణ విభాగం (ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగింది.

వరదలో ఫోటోలు

ఓ వైపు పాట్నాలో వర్ష బీభత్సం కొనసాగుతుంటే.. మరోవైపు ఓ ఫ్యాషన్ టెక్నాలజీ యువతి ఫోట్ షూట్ చేయడం కలకలం రేపుతుంది. అదీ కూడా వర్షపు నీటి మధ్యలో ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదితి సింగ్ అనే విద్యార్థిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో చదువుతుంన్నారు. పాట్నా వీధుల్లో ఫోటోలు తీసుకొని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది.

రెడ్ కలర్ డ్రెస్సు వేసుకొని

అదితి సింగ్ ఎర్రని డ్రెస్సు వేసుకొని ఫోటోలకు ఫోజిచ్చారు. ఆమె ఎందుకు ఫోటోలు దిగిందో అనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. పాట్నాలో పరిస్థితి తెలియజేసేందుకేనని స్పష్టంచేశారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు విభిన్న కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కూడా ఫోటోలు పోస్ట్ చేశారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇప్పటికే 10 వేల లైకులు కూడా వచ్చాయి.

డివైట్ టాక్

అదితి సింగ్ చేసిన ఫోటో షూట్‌ను కొందరు ప్రశంసిస్తున్నారు. కొందరు కొనియాడుతున్నారు. పాట్నాలో పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం విరుచుకుపడుతున్నారు. పాట్నాలో రహదారిపై వర్షపునీరు నిలిచిపోతే బాగు చేయాల్సింది పోయి ఎక్స్‌పోజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని సూచిస్తున్నారు.

క్రియెటివిటీ

క్రియెటివిటీ

వర్షపునీటిలో ఉండేందుకు సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. కానీ అదితి ఉండటం పక్కన పెట్టి ఫోటోలు దిగింది. దానిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. పాట్నా పరిస్థితి ఇదీ అని ప్రపంచానికి చాటారు. దీనిపై బీహర్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాని మరికొందరు అదితి చేసిన పని సృజనాత్మకత అని చెప్తున్నారు. ఇంకొందరు దీనిని పైత్యం అని తిట్టిపోస్తున్నారు.

English summary
heavy rain have flooded homes and hospitals in the capital of Bihar, Patna. The city was brought to a standstill over the weekend after many areas submerged in chest-deep water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X