• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దారుణ హత్య.. రెండు నెలల్లో మూడో మర్డర్..!

|

లక్నో : నేరస్థులు రెచ్చిపోతున్నారు. ఛాయ్ తాగినంత ఈజీగా హత్యలు చేస్తున్నారు. అమాయకుల నుంచి మేధావుల దాకా పొట్టనబెట్టుకుంటున్నారు. ముందు వెనకా ఏమీ ఆలోచించకుండా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అతి కిరాతకంగా ప్రవర్తిస్తూ హత్యలు చేస్తూ పైశాచికంగా మారుతున్నారు. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఘటన చర్చానీయాంశంగా మారింది.

ఉత్తరప్రదేశ్‌లో మరో మహిళా న్యాయవాది హత్య కలకలం రేపింది. 35 సంవత్సరాల నూతన్‌ యాదవ్‌ అనే మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ హత్యకు గురయ్యారు. ఎటా జిల్లా కేంద్రంలో జరిగిన ఈ హత్య స్థానికంగా హాట్ టాపికయింది. పోలీస్ లైన్స్ ఎదురుగా ఉన్న క్వార్టర్స్‌లోని ఆమె నివాసంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆమెను కాల్చి చంపారు. మహిళా న్యాయవాదిని హత్య చేశారనే వార్త దావానంలా వ్యాపించడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

woman public prosecutor shot dead by unknown in uttar pradesh

పీవోకే భారతదేశంలో అంతర్భాగమే.. అసదుద్దీన్‌కు అమిత్ షా కౌంటర్

యువ మహిళా న్యాయవాదిని అత్యంత దారుణంగా చంపిన ఘటనలో ఎటా పోలీస్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ స్పందించారు. ఆ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆగ్రా ప్రాంతానికి చెందిన నూతన్ యాదవ్ ఇంకా పెళ్లి చేసుకోలేదని తెలిపారు. ఆ క్రమంలో ఆమె ఇక్కడ ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలిపారు. అదలావుంటే ఆమె గ్రామానికి చెందిన కొందరు తరచుగా ఆమె ఫ్లాట్‌కు వచ్చేవారని.. అక్కడే బస కూడా చేసేవారని వివరించారు. ఆ నేపథ్యంలో తెలిసినవారే నూతన్ యాదవ్‌ను హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే రకంగా అనుమానాలు వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. పూర్తి వివరాలు సేకరించి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.

అదలావుంటే రెండు నెలల కిందట కూడా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకోవడం గమనార్హం. జూన్ 12వ తేదీన ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ మొదటి మహిళా అధ్యక్షురాలైన 38 సంవత్సరాల దర్వేశ్ యాదవ్‌ను కూడా ఇలాగే చంపారు. తోటి న్యాయవాది ఆగ్రా కోర్టులో చంపిన ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది. ఆమెను హత్య చేసిన అనంతరం ఆయన కూడా సూసైడ్ చేసుకోవడం గమనార్హం. అంతేకాదు ఇలా మహిళా న్యాయవాదులను అతి దారుణంగా చంపుతున్న మరో ఘటన కూడా గత నెలలో వెలుగుచూసింది. జులై 4వ తేదీన 60 ఏళ్ల సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ కుల్‌జీత్ కౌర్ నోయిడాలోని సెక్టార్ 31లోని ఆమె నివాసంలో శవమై తేలిన ఘటన కూడా కలకలం రేపింది.

English summary
The murder of another woman lawyer in Uttar Pradesh is on the rise. 35-year-old Nutan Yadav, a female public prosecutor, has been murdered. The murder, which took place in the center of Eta district, has become a hot topic locally. She was shot dead by unidentified thugs Monday night at her residence in the quarters opposite Police Lines. News of the murder of a female lawyer has spread alarmingly in the local area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X