• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆడో సైకో .. అక్రమ సంబంధానికి అమ్మ వద్దంది, కూతురి కిడ్నాప్

|

న్యూఢిల్లీ : సమాజంలో వింత పోకడలు జరుగుతున్నాయి. ప్రేమ అంటే .. ఇద్దరు టీనేజీ యువతీ, యువకులు మాత్రమే. కానీ నేడు ట్రెండ్ మారింది. ఆంటీలను అబ్బాయిలు ఇష్టపడుతున్నారు. లైక్ చేయడమే కాదు .. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కానీ మన వీర ప్రేమికుడు ఆ మహిళ కూతురిని కిడ్నాప్ చేయడం హైలెట్. పోలీసులు ఆ కేసును 24 గంటల్లో చేధించి .. భగ్న ప్రేమికుడిని కటకటాల్లోకి నెట్టారు.

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి ..

ఢిల్లీకి చెందిన మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటుంది. అయితే ఆమెకు ఇటీవల కమలేశ్ అనే మెకానిక్ పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. అతని ప్రతిపాదనను మహిళ తోసిపుచ్చింది. కానీ మనోడిది వన్ సైడ్ లవ్. మరి ఆంటీని పెళ్లిచేసుకోవాలనే ఉబలాటం ఎక్కువైంది. ఏం చేయాలని ఆలోచించాడు. ఇంకేముంది మెదడులో కిడ్నాప్ అనే ఆలోచన తట్టింది. వెంటనే మహిళ చిన్న కూతురిని కిడ్నాప్ చేశాడు. తన తొమ్మిదేళ్ల కూతురు షాపుకెళ్లి తిరిగిరాకపోవడంతో మహిళ విజయ్ విహార్ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలించారు. గంటలు గడుస్తోన్న కిడ్నాపర్ల నుంచి మహిళకు ఫోన్ రాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందని ఆలోచించారు. సీసీ టీవీ ఫుటేజీ తీశారు.

Woman refuses to marry man, he kidnaps her 9-year-old daughter

కూతురు కిడ్నాప్

అందులో బాలికతోపాటు కమలేశ్ కనిపించాడు. అతను మీకు తెలుసా అని అడిగారు. అప్పుడు నిజం బయటపడింది. ఇదివరకు తాను పనిచేసే వద్దకు వచ్చేవాడని తెలిపింది. అంతేకాదు తనను పెళ్లిచేసుకోవాలని ప్రతిపాదన తీసుకొచ్చాడని వివరించింది. తాను కాదని, పెళ్లిచేసుకోనని తెగేసి చెప్పామని పేర్కొంది. దీంతో తనపై కక్షగట్టి తన కూతురిని కిడ్నాప్ చేశాడని వాపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి .. కమలేశ్ బారి నుంచి బాలికను రక్షించారు. కిడ్నాప్ తతంగం గురించి కమలేశ్‌ని అడిగితే .. మహిళను తాను ప్రేమిస్తున్నానని సెలవిచ్చాడు. పెళ్లి చేసుకోవాలని కోరితే .. తిరస్కరించిందని .. తన కూతురిని కిడ్నాప్ చేసి ఒత్తిడి తీసుకొస్తే దారిలోకి వస్తుందని ఆశించానని పేర్కొన్నాడు. బాధితురాలు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని యాంగిళ్లలో విచారించి .. కమలేశ్‌తో ఉన్న బాలికను సురక్షితంగా కాపాడారు. తర్వాత మహిళకు కూతురిని ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kamlesh, who is a mechanic, fell in love with a woman who has four kids. When the man told the woman he wanted to marry her, the woman refused. The turned-down loved then decided to kidnap one of the woman's kids. The police later arrested Kamlesh. On Monday evening, the woman registered a complaint at Vijay Vihar police station in Delhi's Rohini district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more