వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మామిడితోపులో సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం: అత్యాచారం.. హత్యగా నిర్ధారణ: ఖాళీ మద్యం బాటిల్

|
Google Oneindia TeluguNews

కోల్ కత: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశ నలుగురు కామాంధుల చేతుల్లో దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాల చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. సగం కాలిన ఓ మహిళ మృతదేహం గురువారం ఉదయం పోలీసులకు లభించింది. పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బీజేపీకి బిగ్ షాక్: ప్రతిపక్ష పార్టీలో చేరిన పార్టీ ఉపాధ్యక్షుడు

 మృతదేహం సమీపంలో ఖాళీ మద్యం బాటిల్..

మృతదేహం సమీపంలో ఖాళీ మద్యం బాటిల్..

జిల్లాలోని ధన్తాలా కొత్వాలి గ్రామంలోని ఓ మామిడితోపులో ఈ ఉదయం స్థానిక రైతులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే అంగ్రేజ్ బజార్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం మాల్దాలోని వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. అదే ప్రాంతంలో ఓ ఖాళీ మద్యం బాటిల్ సహా కొన్ని వస్తువులను గుర్తించారు.

అత్యాచారం.. హత్యగా ప్రాథమిక నిర్ధారణ

అత్యాచారం.. హత్యగా ప్రాథమిక నిర్ధారణ

మృతదేహం ఉన్న తీరు, సంఘటనా స్థలంలో లభించిన వస్తువుల ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, హత్యకు పాల్పడి ఉండొచ్చని అంగ్రేజ్ బజార్ పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. మామిడితోపులో ప్రధాన ముఖద్వారం వద్ద మాత్రమే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, వాటి ద్వారా ఎవరెవరు వచ్చి వెళ్లారనే విషయాన్ని పరిశీలిస్తామని మాల్దా డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత దేబ్ నాథ్, పోలీసు సూపరింటెండెంట్ అలోక్ రొజారియా తెలిపారు.పోస్ట్ మార్టమ్ నివేదిక అందిన తరువాతే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించగలమని అన్నారు.

మృతురాలి ఆచూకీ కోసం..

మృతురాలి ఆచూకీ కోసం..

మృతురాలు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖం ఆనవాలు తెలియ రానివిధంగా కాలిపోవడం వల్ల మృతదేహంపై ఉన్న ఇతర గుర్తుల ఆధారంగా ఆమె ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. మాల్దా జిల్లాలోని ఇతర పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులేవైనా నమోదయ్యాయా? అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. మృతురాలు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారై ఉంటారనే విషయం తెలిస్తే.. కేసు దర్యాప్తు ముమ్మరం అవుతుందని పోలీసులు చెబుతున్నారు.

వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతం తరువాత కూడా..

వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతం తరువాత కూడా..

శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతం తరువాత కూడా అలాంటి ఉదంతాలు మళ్లీ, మళ్లీ చోటు చేసుకుంటూ ఉండటంపై ఆందోళనకరంగా మారిందని ఎస్పీ అలోక్ రొజారియా చెప్పారు. ఇలాంటి ఘాతుకాల్లో దోషులకు కఠిన శిక్షలు పడాల్సిన అవసరం ఉందని, జాప్యం చేయకుండా శిక్షలను అమలు చేయాల్సి ఉందని అన్నారు. డాక్టర్ దిశ కేసుతో తాజాగా లభించిన మృతదేహానికి దగ్గరి పోలీకలు ఉన్నాయని చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.

English summary
In a rerun of the Hyderabad veterinary doctor's murder, a young woman's charred body was found in a mango orchard in West Bengal's Malda district on Thursday, raising suspicion that she was raped and killed, a senior police officer said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X