• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వామ్మో.. ఆలయ సమీపంలో మహిళ మొండెం .. బలిచ్చి ఉంటారని అనుమానం ...?

|

గువహతి : శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో ఎంత దూసుకెళ్తున్న మూఢ నమ్మకాలను మాత్రం వీడటం లేదు. ప్రతీరోజు ఎక్కడో ఓ చోట బలీలు జరుగుతూనే ఉన్నాయి. శక్తులనీ, నిధుల కోసం అన్నెం పున్నెం ఎరుగని పిల్లలు బలీ ఇస్తున్నారు. అయితే ఇందులో కొన్ని వెలుగులోకి రాగా .. మరికొన్ని సమాధి అవుతున్నాయి. తాజాగా అసోంలో బలి ఇచ్చిన ఘటన కలకలం రేపుతోంది.

క్షుద్రపూజలు ..

అసోంలోని ప్రముఖ ఆలయం కామాక్య. అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేలాది మంది ప్రజలు వస్తుంటారు. అయితే నిన్న కొందరు క్షుద్రశక్తుల పేరుతో నిలాచల్ హిల్‌పై పూజలు చేసినట్టు తెలుస్తోంది. ఆలయ సమీపంలో ఓ మహిళను బలిచ్చారు. అక్కడ మహిళ మొండెం కనిపించడంతో .. ఆ దిశగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలంలో మట్టి దీపం, కుండ, ఎర్రని ధారం ఉండటంతో బలి ఇచ్చి ఉంటారనే అనుమానాలకు బలం చేకూరింది.

Womans headless body found near Kamakhya temple in Assam, police suspect human sacrifice

రక్తపు మరకలు ...

క్షుద్రపూజలు చేసేందుకు అవసరమైన వస్తువులు అక్కడ కనిపించాయి. ఘటనా స్థలంలో ప్లాస్టిక్ బాటిల్ కనిపించిందని .. దీంతో మహిళను చంపి రక్తం తీసి ఉంటారని భావిస్తున్నారు. నేలపై రక్తం పడి ఉండటం, అక్కడున్న బట్టలకు రక్తం మరకలు అంటడంతో వారి అనుమానం మరింత బలపడింది. ఆమెను చంపే ముందు నిందితులు మభ్యపెట్టి ఘటనాస్థలానికి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు.

ప్రాథమిక సాక్షాలను బట్టి క్షుద్రపూజల కోసం మహిళను బలిచ్చినట్టు అర్థమవుతుందన్నారు డీసీపీ కేకే చౌదరి. మహిళ మొండెనికి పోస్టుమార్టం నిర్వహిస్తామని .. ఆమె మృతికి గల కారణం నివేదికలో తెలుస్తోందని చెప్పారు. వాస్తవానికి కామాక్య ఆలయంలో 22వ తేదీ నుంచి అబుబచి మేల జరుగుతుంది. ఈ క్రమంలో పరిసరాలు శుభ్ర పరుస్తుండగా దారుణం వెలుగుచూసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
discovery of a headless body of a woman in Guwahati has sent chills down the spine in this Assam district. Police suspect this could be a case of human sacrifice and have begun probe to investigate this angle. The body was found at a short distance from the famous Kamakhya temple on Wednesday. Police found it lying on a staircase of a road in Nilachal Hill that leads up to the Kamakhya temple raising suspicion of a human sacrifice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more