• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కలికాలం : భర్త బీర్ తాగనివ్వలేదని..

|

అహ్మదాబాద్ : భార్యాభర్తల బంధానికి విలువే లేకుండా పోయింది. టిక్ టాక్ చేయనివ్వలేదని ఒకరు, టీవీ రిమోట్ ఇవ్వలేదని మరొకరు చిన్న చిన్న కారణాలతో విడాకులకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి బయటకు వచ్చింది. బీర్ తాగనివ్వలేదన్న సిల్లీ రీజన్‌తో ఓ భార్య డైవర్స్‌కు పట్టుబట్టింది. హనీమూన్‌లోనే రచ్చ రచ్చ చేసి పరువు తీసింది. గతేడాది జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

వామ్మో .. ముజఫర్‌నగర్ ఆస్పత్రి వద్ద ఎముకలు, పుర్రె ...

  రెజీనా పెళ్లా ? నిశ్చితార్థం కూడా జరిగిందా ?
  బీర్ తాగొద్దన్న భర్త

  బీర్ తాగొద్దన్న భర్త

  అహ్మదాబాద్ నిర్ణయ్ నగర్‌లోని తరంగహిల్ సొసైటీకి చెందిన విజయ్‌కు మధుపురాకు చెందిన హీరల్‌తో 2018లో పెళ్లైంది. బాజా భజంత్రీలు, బంధువుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా వివాహతంతు జరిపారు. అనంతరం కొత్త దంపతులు హనీమూన్ కోసం ఇండోనేషియాలోని బాలీ ద్వీపానికి వెళ్లారు. పగలంతా బయట ఎంజాయ్ చేసిన భార్యభర్తలు రాత్రికి రూంకు చేరుకున్నారు. ఇంతలో హీరల్, విజయ్‌ను బీర్ తాగుదామని కోరింది. అయితే మద్యం తాగడం ఇష్టంలేని అతను అందుకు నిరాకరించాడు. ఆమెను కూడా మద్యం తాగవద్దని అన్నాడు.

  హోటల్‌లో రచ్చ రచ్చ

  హోటల్‌లో రచ్చ రచ్చ

  భర్త నోటి నుంచి వద్దు అనే మాట వినేసరికి హీరల్ కోపంతో ఊగిపోయింది. తాము చెకిన్ అయిన హోటల్ రచ్చ రచ్చ చేసింది. హోటల్‌లోని ఇతర రూంల తలుపులు బాదుతూ హంగామా సృష్టించింది. ఈ అలికిడికి రూంల నుంచి బయటకు వచ్చిన వారికి తన భర్త బీర్ తాగనివ్వడంలేదని, అలాంటి వ్యక్తితో జీవితం ఎలా గడపాలని ప్రశ్నించింది. అలాంటి భర్తతో తాను కాపురం చేయలేనని తనకు వెంటనే విడాకులు కావాలని డిమాండ్ చేసింది.

  విడాకుల కోసం రూ.20 లక్షల డిమాండ్

  విడాకుల కోసం రూ.20 లక్షల డిమాండ్

  హనీమూన్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత హీరల్ అత్తగారింట్లో రచ్చ చేసింది. మూటముల్లె సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త నుంచి విడాకులు కోరుతూ నోటీసులు పంపిన హీరల్.. భరణం కింద 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వనిపక్షంలో తప్పుడు కేసులు పెడతామని కుటుంబాన్ని రోడ్డుపైకి తెస్తామని బెదిరింపులకు దిగింది. దీంతో బాధిత భర్త పోలీసులను ఆశ్రయించడంతో ఇన్నాళ్లకు విషయం వెలుగులోకి వచ్చింది. భర్త నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  English summary
  woman seeks divorce after husband stops her from drinking beer. This incident took place in gujrat ahmed nagar. The couple went to Indonesia for honeymoon there wife offerd beer to husband. when he refused and stopped her from drinking beer she get angry and created ruckus in hotel.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X