వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగ్నంగా మహిళ, మర్మాంగంలో కారం పొడి, రోడ్డులో ఊరేగింపు, నా మొగుడితో నీకేం పని !

రుణం తీసుకున్న వ్యక్తి ఇంటికి డబ్బులు ఇచ్చిన మహిళ వెళ్లింది. తీసుకున్న రుణం చెల్లించాలని చెప్పింది. అదే సమయంలో రుణం తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను నగ్నంగా తయారు చేసి దాడి చేసి నడి రోడ్డు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రుణం తీసుకున్న వ్యక్తి ఇంటికి డబ్బులు ఇచ్చిన మహిళ వెళ్లింది. తీసుకున్న రుణం చెల్లించాలని చెప్పింది. అదే సమయంలో రుణం తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను నగ్నంగా తయారు చేసి దాడి చేసి నడి రోడ్డులో అర్ద కిలోమీటరు ఊరేగింపుగా తీసుకెళ్లారు.

రేప్ కేసులో బెటా చైర్మన్ అరెస్టు: ఉద్యోగినిపై అత్యాచారం, గర్బవతి, అబార్షన్ కోసం వెళ్లి !రేప్ కేసులో బెటా చైర్మన్ అరెస్టు: ఉద్యోగినిపై అత్యాచారం, గర్బవతి, అబార్షన్ కోసం వెళ్లి !

ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా చేసి ఆమెను తొమ్మిది మంది కుటుంబ సభ్యులు చితకబాదేశారు. ఘటన కర్ణాటకలోని విజయపుర (బీజాపుర) జిల్లా ఇండి తాలుకా హీరేమసహళ్ళి గ్రామంలో జరిగింది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. విజయపుర జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఎంబీ. పాటిల్ బుధవారం బాధితురాలిని పరామర్శించారు.

ఇద్దరూ ఒకే గ్రామస్తులు

ఇద్దరూ ఒకే గ్రామస్తులు

విజయపుర జిల్లా ఇండి తాలుకాలోని హీరేమసళి గ్రామంలో సవిత (35) అనే మహిళ నివాసం ఉంటుంది. అదే గ్రామంలో నివాసం ఉంటున్న మౌలాలి పాన్ బీడా సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఒకే గ్రామంలో నివాసం ఉండటంతో చాల ఏళ్ల నుంచి ఇద్దరికి పరిచయం ఉంది.

మౌలాలి ఇంటిలో సవిత

మౌలాలి ఇంటిలో సవిత

సోమవారం సాయంత్రం సవిత మౌలాలి ఇంటికి వెళ్లింది. ఆ సందర్బంలో ఇంటిలో మౌలాలి తప్పా అతని కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు. మౌలాలి, సవిత మాట్లాడుకుంటున్న సమయంలో అతని భార్యతో సహ కుటుంబ సభ్యులు అందరూ ఒకే సారి ఇంటికి వచ్చారు.

అక్రమ సంబంధం ఉందని

అక్రమ సంబంధం ఉందని

మౌలాలితో అక్రమ సంబంధం పెట్టుకుంటావా అంటూ అతని కుటుంబ సభ్యులు సవితను చితకబాదేశారు. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా చేసి ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. సవిత నగ్నంగా ఉన్న సమయంలో మొబైల్ లో వీడియో తీశారు. అదే సమయంలో మౌలాలి మీద దాడి జరిగింది.

సవిత మర్మాంగంలో కారం పోడి

సవిత మర్మాంగంలో కారం పోడి

సవితను ఇష్టం వచ్చినట్లు చితకబాదిన మౌలాలి కుటుంబ సభ్యులు ఆమె మర్మాంగంలో కారం పొడి పోశారు. కర్రతో కారం పొడి లోపలికి చొప్పించారు. ఆమెను నగ్నంగా తయారు చేసి దాడి చేసి కారం పొడి పోసిన మొత్తం దృశ్యాలను మౌలాలి కుటుంబ సభ్యులు మొబైల్ లో వీడియో తీశారు. సవితను నగ్నంగానే ఇంటి బయటకు తీసుకు వచ్చారు. తరువాత ఇంటి ముందు అందరూ చూస్తుండగానే సవితను చితకబాదేశారు.

అర్దకిలో మీటరు ఊరేగింపు

అర్దకిలో మీటరు ఊరేగింపు

సవితను నగ్నంగా అర్ద కిలోమీటరు దూరం ఊరిగించారు. తరువాత నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితురాలు ఇండి గ్రామీణ పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి సర్కిల్ ఇన్స్ పెక్టర్ చంద్రకాంత నందరెడ్డి సవిత మీద దురుసుగా ప్రవర్తించి అసలు నువ్వు ఎందుకు మౌలాలి ఇంటికి వెళ్లావు అని ఆమెనే బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.

రూ. 30 వేలు రుణం ఇచ్చాను ?

రూ. 30 వేలు రుణం ఇచ్చాను ?

మౌలాలితో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని బుధవారం బాధితురాలు విజయపుర జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఎంబి. పాటిల్ కు చెప్పింది. మౌలాలి తన దగ్గర రూ. 30 వేలు రుణం తీసుకున్నాడని, ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని వెళ్లి అడిగితే అతని కుటుంబ సభ్యులు తొమ్మిది మంది తన మీద దాడి చేశారని సవిత మంత్రి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

9 మంది మీద కేసు నమోదు

9 మంది మీద కేసు నమోదు

విజయపురలోని బిఎల్ డీ ఇ సంస్థకు చెందిన మెడికల్ కాలేజ్ లో బాధితురాలు సవిత చికిత్స పొందుతున్నది. బుదవారం మంత్రి ఎంబి పాటిల్ బాధితురాలు సవితను పరామర్శించారు. సవిత మీద దాడి చేసిన మౌలాలి కుటుంబ సభ్యులు తొమ్మిది మంది మీద కేసు నమోదు చేశారని మంత్రి ఎంబి. పాటిల్ మీడియాతో చెప్పారు.

ఇంత దారుణంగా !

ఇంత దారుణంగా !

సవిత పట్ల మానవత్వం లేకుండా దారుణంగా ప్రవర్థించిన మౌలాలి కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేశామని విజయపుర జిల్లా ఎస్పీ కులదీప్ కుమార్ జైన్ మీడియాకు చెప్పారు. ఇప్పటికే మౌలాలి భార్య షభానా, ఆమె సోదరుడు సికిందర్, షభానా సికిందర్, షబ్బీర్, ఫరీదా షబ్బీర్, ఇస్మాయిల్ బాష, షరీజా అనే నిందితులను అరెస్టు చేశామని సుభానా అనే మహిళ పరారైయ్యింది జిల్లా ఎస్పీ కులదీప్ కుమార్ జైన్ మీడియాకు చెప్పారు.

రెండు వర్గాలు, హై అలర్ట్

రెండు వర్గాలు, హై అలర్ట్

సవిత, మౌలాలి వేరు వేరు వర్గాలకు చెందిన వారు కావడంతో గొడవలు జరగకుండా ఇండి తాలుకాలో పోలీసులు గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు. సవిత పట్ల దారుణంగా ప్రవర్తించిన వారు ఎవరైనా సరే వదిలేది లేదని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఎంబీ. పాటిల్ మీడియాకు చెప్పారు.

English summary
A 35-year-old woman who sought repayment of a Rs 30,000 loan was allegedly thrashed, stripped and paraded on the road by the loanee's family at Hire Masali village, Indi taluk in Vijayapura district in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X