వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్జి పుష్పకు 150 కండోమ్‌లు పంపిన మహిళ -రేప్ కేసుల్లో వివాదాస్పద తీర్పులకు నిరసనగా..

|
Google Oneindia TeluguNews

న్యాయవ్యవస్థ తీరుపై అటు పార్లమెంటులో విపక్షాల ఆందోళనకు తోడు సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతోన్న తరుణంలో.. గుజరాత్‌కు చెందిన ఓ మహిళ అనూహ్య చర్యకు పాల్పడింది. మైనర్ బాలికలపై రేప్ అటెప్ట్ కేసుల్లో వివాదాస్పద తీర్పులిచ్చిన మహిళా జడ్జికి ఏకంగా కండోమ్ ప్యాకెట్లు పంపి తన నిరసన తెలిపింది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వార్త వివరాల్లోకి వెళితే..

ప్రత్యేక రాయలసీమకు వైఎస్ షర్మిల -ఒకటికి కోటి బాణాలు -కేసీఆర్ బర్త్‌డేలో గంగుల సంచలనంప్రత్యేక రాయలసీమకు వైఎస్ షర్మిల -ఒకటికి కోటి బాణాలు -కేసీఆర్ బర్త్‌డేలో గంగుల సంచలనం

12 ప్రదేశాలకు 150 కండోమ్స్..

12 ప్రదేశాలకు 150 కండోమ్స్..

బాలికలపై లైంగిక దాడికి సంబంధిచి, పోస్కో కేసుల్లో ఇటీవల వివాదాస్పద తీర్పులు వెల్లడించిన బాంబే హైకోర్టు నాగపూర్‌ బెంచ్ జడ్జి జస్టిస్‌ పుష్ప గనేడివాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సదరు తీర్పుల కారణంగా ఆమె ప్రమోషన్ కోల్పోగా, ఇప్పటికీ పలు రూపాల్లో నిరసనలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా, అహ్మదాబాద్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు దేవ్‌శ్రీ త్రివేది.. జస్టిస్‌ పుష్ప గనేడివాలాకు మొత్తం 150 కండోమ్ ప్యాకెట్లు పంపారు. జడ్జి పుష్ప అధికారిక నివాసంతోపాటు నాగ్‌పూర్‌ బెంచ్‌ రిజిస్ట్రీ ఆఫీసు, బాంబే హైకోర్టు ప్రధాన కార్యాలయం తదితర 12 ప్రదేశాలకు కండోమ్‌లు పంపినట్లు త్రివేది వెల్లడించింది.

జడ్జి పుష్పపై నిరసనగానే..

జడ్జి పుష్పపై నిరసనగానే..

''ఆ మహిళా జడ్జి వెలువరించిన అన్యాయమైన తీర్పులను నేను సంహించలేకపోతున్నాను. జస్టిస్ పుష్ప తీర్పుల వల్ల ఓ మైనర్‌ బాలికకు న్యాయం జరగలేదు. ఆమెను వెంటనే సస్పెండ్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాను. ఆమె తీర్పు పట్ల నా నిరసన తెలియజేయడం కోసం ఇలా కండోమ్‌ ప్యాకెట్లు పంపాను. మొదట ఈ నెల 9న కొన్ని ప్యాకెట్లు పంపాను. అవి డెలివరీ అయినట్లు రిపోర్ట్‌ అందింది. నిజానికి..

 ఒక మహిళగా నేను చేసింది కరెక్టే..

ఒక మహిళగా నేను చేసింది కరెక్టే..

ఓ మహిళగా నేను చేసిన పని తప్పని అసలే భావించడం లేదు. దీని గురించి నాకు ఎలాంటి చింత లేదు. మహిళలు తమ హక్కుల కోసం పోరాడాలి. జస్టిస్‌ పుష్ప లాంటి వాళ్లిచ్చే తీర్పుల వల్ల మగాళ్లు మరింత రెచ్చిపోతారు. ఆడవారిపై అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. స్త్రీల దుస్తుల మీదుగానే అత్యాచారాలు జరుగుతాయి'' అంటూ దేవ్‌శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.

 స్కిన్ టు స్కిన్ తగలకుంటే రేప్ కాదు..

స్కిన్ టు స్కిన్ తగలకుంటే రేప్ కాదు..

పోస్కో చట్టం కింద నమోదైన కేసుల్లోనిందితులను నిర్దోషులుగా వదిలేస్తూ.. జడ్జి పుష్ప గనేడివాలా.. ''నేరుగా బాలిక శరీరాన్ని తాకుకుండా.. దుస్తుల పైనుంచే ఆమె రొమ్ములను నలిపేశాడు కాబట్టి ఇది పోక్సో చట్టం కింద లైంగిక దాడిగా పరిణించలేం'' అని ఒక కేసులో.. ''బాలిక చేతిని పట్టుకుని అతను ప్యాంట్‌ జిప్‌ తెరిచినంత మాత్రాన లైంగిక దాడిగా పరగణించలేం'' అని మరో కేసులో తీర్పు చెప్పడం తెలిసిందే. ఈ రెండు తీర్పులపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయితే..

కోర్టు ధిక్కారం.. పుష్పకు ఎక్స్‌టెన్షన్

కోర్టు ధిక్కారం.. పుష్పకు ఎక్స్‌టెన్షన్

మహిళా జడ్జి పుష్ప గనేడివాలా తీర్పులను నిరసిస్తూ అహ్మదాబాద్ మహిళ కండోమ్ ప్యాకెట్లు పంపడం కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని నాగ్ పూర్ బార్ అసోసియేషన్ కు చెందిన సీనియర్ అడ్వొకేట్ శ్రీరంగ్ భండార్కర్ అన్నారు. సదరు మహిళపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టును కోరతానని ఆయన చెప్పారు. పోస్కో కేసుల్లో వివాదాస్పద తీర్పుల తర్వాత జస్టిస్ పుష్ప పదోన్నతి ఫైలును సుప్రీంకోర్టు కొలీజియం పక్కన పెట్టేసింది. అయితే, అందుకు పరిహారం అన్నట్లుగా, బాంబే హైకోర్టు(నాగపూర్ బెంచ్) అడిషనల్ జడ్జిగా ఆమె పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు.

ys sharmila అసాధారణ స్పీడు -యుద్ధ నౌక గద్దర్, మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ -సలహాదారులూ ఖరారు!ys sharmila అసాధారణ స్పీడు -యుద్ధ నౌక గద్దర్, మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ -సలహాదారులూ ఖరారు!

English summary
Awoman from Ahmedabad claims to have sent 150 condoms to Bombay High Court additional judge Justice Pushpa V Ganediwala as a mark of protest against her recent controversial verdicts in sexual assault cases under the POCSO Act. Devshri Trivedi, who claims to be a political analyst, said she had sent condoms to 12 different locations, including Justice Ganediwala's chamber, the registry of the Nagpur bench of the Bombay High Court and the principal seat in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X