వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: తమ పార్టీకి ఓటేయలేదని కాల్చేశారు! మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Woman 'set afire' for not voting particular candidate dies
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో చెప్పిన అభ్యర్థికి ఓటు వేయలేదన్న కారణంతో ముగ్గురు వ్యక్తుల చేతులలో సజీవదహనయత్నానికి గురైన వృద్ధురాలు.. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ సోమవారం నాసిక్ సివిల్ ఆసుపత్రిలో మృతి చెందింది.

నాసిక్ జిల్లా యేవలా తాలుకా బభూల్ గావ్ గ్రామానికి చెందిన జోలూబాయి జగన్నాథ్ వాబలే (65) గురువారం రాత్రి ఇంటి ముంగిట అరుగు పైన కూర్చొని ఉండగా అదే గ్రామానికి చెందిన అశోక్ సోపన్, పాండురంగ సోపన్ బోరనారే, నందకిశోర్ విశ్వనాథ్ బురక్ కిరోసిన్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే.

కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలానా అభ్యర్థికి ఓటేయలేదన్న అక్కసుతో ఏయెలా నియోజకవర్గంలో కొంతమంది దుండగులు 65 ఏళ్ల వృద్ధురాలిని పాశవికంగా కిరోసిన్‌ పోసి తగులబెట్టారు. ఆమె పేరు జెలుబాయ్‌ వాబ్లే. ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌లో నెంబర్‌ 2కు ఎదురుగా అభ్యర్థికి ఆమె ఓటు వేయలేదన్న కోపంతో ముగ్గురు వ్యక్తులు ఈనెల 16న ఆమె ఇంటికి వెళ్లి ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు.

దీంతో 80 శాతం కాలిన గాయాలతో ఆమె ఐదు రోజులపాటు ఆస్పత్రిలో నరకయాతన పడి సోమవారం మృతి చెందింది. ఎన్సీపీ ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ పోటీ చేసిన నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది. తనపై ముగ్గురు వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్లు ఆమె మరణ వాంగ్మూలంలో చెప్పింది.

తనకు మీట అర్థం కాక ఒకటి నొక్కబోయి మరొకటి నొక్కానని ఆ వృద్ధురాలు తనను నిలదీసిన వారికి కూడా చెప్పిందంట. అయితే వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ తన తల్లికి కాలిన గాయాలయ్యాయని ఆమె కొడుకు రఘునాథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

English summary
A 65 year-old woman, allegedly set ablaze for not voting for a particular candidate in Yeola Assembly constituency in Nashik district in October 15 polls, succumbed to her injuries while undergoing treatment at civil hospital here on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X