వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాణికురాలీ మొబైల్ ఫోన్ కోసం కక్కుర్తి పడిన రైల్వే ఉద్యోగి.... అడ్డంగా దొరకడంతో చితకబాదిన మహిళ

|
Google Oneindia TeluguNews

తన సెల్‌ఫోన్‌ను తస్కరించిన ఓ రైల్వే ఉద్యోగిని ఓ మహిళ నిలదీసింది..తాను తీయలేదని సమాధానం చెప్పిన ఉద్యోగిని తనీఖీలు చేయడంతో జేబులో సెల్‌ఫోన్ బయటపడింది...దీంతో అగ్రహానికి గురైన మహిళ టికెట్ కౌంటర్‌లో ఉన్న ఉద్యోగిని చితక బాదింది. ఉద్యోగిని తన కార్యాలయంలోనే చితకబాదుతూ వీడియో సైతం తీయించింది. అనంతరం వీడీయోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది...దీంతో ఉద్యోగి సస్పెండ్ అవగా..చితకబాదిన వీడీయో మాత్రం సోషల్ మీడీయాలో వైరల్ అవుతుంది.

ముంబాయిలోని సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో నందిని బెలేకర్ మహిళ ప్రయాణికురాలు టికెట్ కొనుగోలు చేసింది.. అయితే హడావిడిలో సదరు మహిళ తన మొబైల్‌ను కౌంటర్ వద్దే మరిచి వెళ్లిపోయింది.... తిరిగి మొబైల్ చూసుకున్న తర్వాత రైల్వే టికెట్ కౌంటర్‌లో ఉన్న క్లర్క్ వద్దకు వెళ్లి అడిగింది..అయితే ప్రయాణికురాలి సెల్ ఫోన్ తాను తీయలేదంటూ బుకాయించాడు సదరు ఉద్యోగి. అయితే కౌంటర్‌లోనే మరిచి పోయానని ఖచ్చితంగా చెప్పిన ప్రయాణికురాలు అనుమానంతో టికెట్ కౌంటర్‌లోకి వెళ్లింది..దీంతో మొబైల్‌కు సంబంధించిన పౌచ్ కౌంటర్ వద్ద పడి ఉంది...దీన్ని గమనించిన నందిని బెలేకర్ టికెట్స్ ఇచ్చే క్లర్క్ పాకెట్స్‌ను చెక్ చేయించింది..ఫోన్ కోసం కక్కుర్తి పడ్డ ఉద్యోగి బండారం బయటపడింది.

Woman Slaps Railways Clerk For Stealing Her Mobile

దీంతో ఉద్యోగిని కౌంటర్‌లోనే చెంపలు వాయించి వెళ్లింది..ఇంతటితో ఆగకుండా మరో ఇరవైమందితో కౌంటర్‌లోకి వెళ్లి మరోసారి చెడామడా రైల్వే ఉద్యోగి చెంపలు వాయించింది..అంతే కాకుండా తాను కొడుతున్నప్పుడు వీడియో సైతం తీయించింది..అయితే దొంగతనం బయటపడిన ఉద్యోగి మహిళ కొడుతున్నా ఎదిరించలేని పరిస్థితిలోకి పోయాడు. ఇక తాను కొట్టిన వీడీయోను సోషల్ మీడీయాలో పోస్టు చేసింది..ఇక సంఘటనపై విచారణ చేపట్టిన అధికారులు సదరు ఉద్యోగిని సస్పెండ్ చేశారు..అయితే ఇంత చేసిన మహిళ ఉద్యోగిపై మాత్రం ఎలాంటీ కేసును నమోదు చేయలేదు.

English summary
Nandini Belekar, who had gone to purchase a railway ticket had mistakenly left her mobile at the ticket counter of Mumbai Central railway station. Realising her fault, she returned back to the counter and asked about her phone to the Indian Railways staff. But, he denied having seen her mobile.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X