వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడేళ్ల కిందటే ప్రేమ వివాహం: అంత‌లోనే అనుమానాస్ప‌ద మ‌ర‌ణం

|
Google Oneindia TeluguNews

హాస‌న‌: క‌ర్ణాట‌క‌లోని హాస‌నలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మూడేళ్ల కింద‌టే ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఓ గృహిణి అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. ఆమె మృతిపై భిన్న క‌థ‌నాలు వినిపిస్తున్న‌యి. అద‌న‌పు క‌ట్నం కోసం అత్తామామ‌లే త‌మ కుమార్తెను హ‌త్య చేసి ఉంటార‌ని మృతురాలి త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతురాలి పేరు అశ్విని. హాస‌న‌లోని శంక‌రిపురలో భ‌ర్త ఆదిత్య‌, అత్తామామ‌ల‌తో క‌లిసి నివ‌సిస్తున్నారు.

ఆదివారం సాయంత్రం ఇంట్లో పెద్ద ఎత్తున గొడ‌వ‌లు చెల‌రేగిన‌ట్లు చుట్టుప‌క్క‌ల‌వారు చెబుతున్నారు. అప‌స్మార‌క స్థితిలో ఉన్న అశ్వినిని ఆమె భ‌ర్త ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె మ‌రణించారు. విషం సేవించ‌డం వ‌ల్లే అశ్విని మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు.

ఊపిరితీసిన ప్రేమ : యువతి కోసం ఆందోళన, మరునాడే మ‌ృతిఊపిరితీసిన ప్రేమ : యువతి కోసం ఆందోళన, మరునాడే మ‌ృతి

Woman suspicious death at Hassan in Karnataka

బెంగ‌ళూరుకు చెందిన అశ్విని వివాహానికి ముందు సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా ప‌నిచేసే వారు. ఈ క్ర‌మంలో ఆమెకు ఆదిత్య‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. మూడేళ్ల కింద‌ట పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఆదిత్య త‌ల్లిదండ్రులు అంగీక‌రించ‌లేద‌ని తెలుస్తోంది. ఆదిత్య బ‌ల‌వంతం మీద వారితో క‌లిసి నివ‌సించ‌డానికి అంగీక‌రించిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. పెళ్లి త‌రువాత అశ్విని ఉద్యోగాన్ని వ‌దిలేశారు.

భ‌ర్త‌తో క‌లిసి హాస‌న‌లో నివ‌సిస్తున్నారు. కొంత‌కాలంగా ఆదిత్య త‌ల్లిదండ్రులు అద‌న‌పు క‌ట్నం కోసం త‌మ కుమార్తెను వేధిస్తున్నార‌ని అశ్విని త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ఆదిత్య, అత‌ని త‌ల్లిదండ్రుల‌ను అదుపులోకి తీసుకుని విచార‌ణ చేప‌ట్టారు. కాగా- పోస్ట్‌మార్ట‌మ్ నివేదిక త‌రువాత అస‌లు విష‌యం తేలుతుంద‌ని పోలీసులు చెబుతున్నారు.

English summary
A Died in Suspicious circumstances in Hassan in Karnataka. Aswini, 29 years old woman married Adithya three years before. The Couple living in Hassan. On Monday early morning Aswini died in hospital. Doctors told that, The cause of death is Poison. On the basis of Aswini's parents, Police lodged a complaint and started investigation into this Case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X