
వావ్.. ప్రేమ కోసం నదీని ఈదిన అతివ.. లవర్‌ను కలిసి పెళ్లి.. ఆ తర్వాత
ప్రేమ గుడ్డిది అంటారు.. అవును ప్రేమ కోసం ఎంతటికైనా తెగిస్తారు నిజమైన ప్రేమికులు.. ఇందులో సందేహాం లేదు. అయితే ఓ యువతి మాత్రం నదీని ఈదారు. మరో దేశానికి వచ్చారు. అయితే ఆమె ఆ దేశం వచ్చేందుకు సరి అయిన ధృవపత్రాలు లేవు.. ఆ యువతి బంగ్లాదేశ్‌కు చెందినవారు కాగా.. భారతదేశానికి ఈదుతూ వచ్చారు. తర్వాత లవర్‌ను కలిసి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాతే విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ యువతి పేరు కృష్ణ మండల్.. ఆమె అభిషేక్ మండల్‌ను ఫేస్ బుక్ ద్వారా దగ్గరయ్యింది. తర్వాత వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆమెకు పాస్ పోర్టు లేదు. సో లవర్‌ను కలవాలంటే.. అక్రమగా ప్రవేశించాల్సిందే.. మరో మార్గం లేదు. తొలుత ఆమె సుందర్ బాన్స్లోకి ప్రవేశించింది.. అలా నదీలో ఈదుతూ తమ గమ్యానికి చేరుకున్నారు.

అలా చేరిందో లేదో.. ప్రేమికుడిని కలిసింది. వారిద్దరూ కలిసి కలకత్తిలో గల కలిఘాట్ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే సోమవారం ఆమె పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని అభియోగం మోపారు. ఆమెను బంగ్లాదేశ్ హై కమిషన్‌కు అప్పగించారు. ఈ ఘటన కలకలం రేపింది.
మరోవైపు బంగ్లాదేశ్ ఇటీవల ఇమామ్ హొస్సెన్ అనే యువకుడు కూడా ఇలానే ఈదుతూ వచ్చింది. అతనికి కూడా పాస్ పోర్టు లేదు. అయితే చాక్లెట్ కోసం వచ్చాడు. అతనిని కోర్టులో ప్రవేశపెట్టారు. 15 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ కూడా విధించారు.