• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గంటకు రూ.5,000..ఫుల్ నైట్ రూ.15,000: హైప్రొఫైల్ సెక్స్ వర్కర్‌గా మహిళా టెక్కీ ఫొటో సర్కులేట్

|

నొయిడా: గ్రేటర్ నొయిడాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హైప్రొఫైల్ సెక్స్ వర్కర్‌గా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫొటోను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ మహిళా టెక్కీ ఫొటోను తమ ధందా కోసం వినియోగించుకుంటున్నారు. ఆమె ఫొటో.. ఫోన్ నంబర్ సహా సోషల్ మీడియాలో పోస్ట్ కావడం నొయిడాలో కలకలం రేపుతోంది. ఈ ఘటన తరువాత- గ్రేటర్ నొయిడా పరిధిలో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తోన్న మహిళా ఉద్యోగినుల భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

ఫేక్ టీఆర్పీ రేటింగ్ రచ్చ: పార్లె జీ సంచలన నిర్ణయం: వాటికి దూరం?: జనానికి విషం పంచేలాఫేక్ టీఆర్పీ రేటింగ్ రచ్చ: పార్లె జీ సంచలన నిర్ణయం: వాటికి దూరం?: జనానికి విషం పంచేలా

 సెక్స్ వర్కర్‌గా ఇద్దరు పిల్లల తల్లి ఫొటో..

సెక్స్ వర్కర్‌గా ఇద్దరు పిల్లల తల్లి ఫొటో..

తన ఫొటో.. పెయిడ్ సెక్స్ వర్కర్స్ గ్రూపుల్లో కనిపించిన వెంటనే ఆమె సెక్టార్ 49 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఈ కేసును బదలాయించారు. 40 సంవత్సరాల వయస్సున్న బాధితురాలు.. కొంతకాలంగా గ్రేటర్ నొయిడాలోని ఓ టాప్ మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీనియర్ ర్యాంక్‌లో పని చేస్తున్నారు. ఆకర్షణీయమైన వేతనాన్ని పొందుతున్నారు. ఆమె వివాహితురాలు. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నొయిడాలో నివసిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే ఆమె తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

 రేటును కూడా నిర్ధారిస్తూ..

రేటును కూడా నిర్ధారిస్తూ..

అదే ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు తమ ధందా కోసం వినియోగించుకున్నారు. హైప్రొఫైల్ పెయిడ్ సెక్స్ వర్కర్‌గా ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫేస్‌బుక్ గ్రూపులు, వాట్సప్ ద్వారా సర్కులేట్ చేశారు. ఆ మహిళా టెక్కీ వాట్సప్ నంబర్‌ను కూడా ఆ ఫొటోకు ట్యాగ్ చేశారు. ఏకాంతంగా గడపడానికి గంటకు 5000 రూపాయలు, రాత్రి మొత్తం గడిపితే 15,000 రూపాయల రేటును నిర్ధారించారు. అడ్వాన్స్‌గా 7,000 రూపాయలను చెల్లించాల్సి ఉంటుందనీ రేటు పెట్టారు. పేమెంట్ కోసం చెల్లింపుల కోసం కోటక్ మహేంద్ర బ్యాంక్ అకౌంట్‌ నంబర్‌ను ఆ ఫొటోతో పాటు ముద్రించినట్లు పోలీసులు గుర్తించారు.

  Two Earthquakes In Karnataka, Jharkhand At The Same Time On Friday
  అపరిచితుల ఫోన్ కాల్స్..

  అపరిచితుల ఫోన్ కాల్స్..

  ఈ ఫొటో సర్కులేట్ కావడం ప్రారంభమైన తరువాత.. తనకు అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ రావడం ఆరంభం అయ్యాయని, అశ్లీల సమాచారం తన వాట్సప్ నంబర్‌కు వస్తున్నాయని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత మహిళ ఫొటోను వేర్వేరు పేర్లతో వేర్వేరు ఫేస్‌బుక్ గ్రూపుల్లో పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సెప్టెంబర్‌లో ఆమె ఫొటో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్ అయినట్లు గుర్తించారు. తన ఫొటో పెయిడ్ సెక్స్ వర్కర్‌‌గా సోషల్ మీడియాలో పోస్ట్ కావడాన్ని తొలుత తన స్నేహితులు గుర్తించారని, ఆ గ్యాంగ్‌తో మాట్లాడటానికి ప్రయత్నించారనితెలిపారు.

  English summary
  A 40-year-old software professional has registered a complaint at Sector 49 police station in Noida, stating a gang has circulated her pictures on WhatsApp and Facebook, along with a phone number, on multiple social media platforms for paid sexual favours.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X