వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8మంది ఆడ పిల్లలను కన్నదని ఇంటి నుంచి గెంటేశారు

|
Google Oneindia TeluguNews

 Woman thrown out of house for giving birth to eight girls
జైసల్మేర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిది మంది ఆడ పిల్లలను కన్నదనే నెపంతో ఓ మహిళను చితకబాదిన ఆమె అత్తామామలు ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె తన భర్త, పిల్లలతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కాగా, మహిళా సలహా సంప్రదింపుల కేంద్రం సహాయంతో తమ సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు ఆమెకు సూచించారు.

తాను ఆడ పిల్లలకు జన్మనిచ్చాననే నెపంతో తన అత్తామామలు తనపై దాడికి దిగారని, ఆ తర్వాత తనను ఇంటి నుంచి గెంటేశారని బాధిత మహిళ ఆరోపించింది. ఆడ పిల్లలు కనడంలో తన ఒక్కదానిదే తప్పని, మగ పిల్లలను కనడం లేదని వారు తనను హింసిస్తున్నారని చెప్పింది.

వివరాల్లోకి వెళితే.. బాధితురాలు పప్పు దేవి ఎనిమిది మంది ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. మరో ఇద్దరు బాలికలు చనిపోయారు. ఆమె భర్త గోపాల్ దేసాంత్రి. ఆమె మగ పిల్లలకు జన్మనివ్వడం లేదని ఆగ్రహించిన ఆమె అత్తామామలు ఆమెను రోడ్డుపైకి గెంటేశారు.

కాగా, పోలీసుల సూచనతో ఆమె మహిళా కాన్సల్టెన్సీని కలిసి విషయాన్ని వివరించింది. అనంతరం కన్సల్టెంట్ శోభా గౌర్ మాట్లాడుతూ.. బాధిత మహిళను ఏడాది క్రితం కూడా అత్తామామలు హింసించారని, అప్పుడు కూడా ఆమె పోలీసులను ఆశ్రయించిందని ఆమె తెలిపింది. బాధితురాలి భర్త కూలీగా పని చేస్తున్నాడని తెలిపింది. బాధితురాలికి తగిన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామని ఆమె తెలిపింది.

English summary
A woman's in-laws beat her and threw her out of the house with her husband and children on Tuesday. The victim reached the police station along with her husband and children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X