వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరా బాబా కోసం జైల్లోకి దౌర్జన్యంగా వెళ్లిన మహిళ: నానా హంగామా, చివరికి జైలుకెళ్లింది !

అత్యాచారం కేసులో 10 శిక్షకు గురైన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ (డేరా బాబా) ను చూడటానికి ఓ మహిళ దౌర్జన్యంగా జైల్లోకి ప్రవేశించి నానా హంగామా చేసింది. రోహతక్ లోని సునారియా జైల్లో చోరబడి

|
Google Oneindia TeluguNews

రోహతక్: అత్యాచారం కేసులో 10 శిక్షకు గురైన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ (డేరా బాబా) ను చూడటానికి ఓ మహిళ దౌర్జన్యంగా జైల్లోకి ప్రవేశించి నానా హంగామా చేసింది. రోహతక్ లోని సునారియా జైల్లో చోరబడి అధికారులకు చుక్కలు చూపించిన మహిళ ఇప్పుడు కటకటాలపాలైయ్యింది.

సోమవారం జైలు ఆవరణంలోని తాత్కాలిక సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు శిక్ష ఖరారు చెయ్యకముందే తాను గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను చూడాలని ఓ మహిళ జైలు ఆవరణంలోకి దౌర్జన్యంగా ప్రవేశించింది. జైలు సిబ్బంది, పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.

Woman tries to meet Gurmeet Ram Rahim in jail in Rohtak.

Recommended Video

Gurmeet Case Started With An Anonymous Letter నీలి చిత్రాలు చూస్తూ మూడేళ్ల పాటు అత్యాచారం...

పదేపదే జైల్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న మహిళను అడ్డుకున్న పోలీసులు ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. సునారియా జైలు సమీపంలోని బైపాస్ రోడ్డు నుంచి మరో సారి ఆమె జైల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్టు చేసి ఝజ్వార్ జైలుకు తరలించారు. జైల్లో దౌర్జన్యంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళ పేరు, వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Woman tries to meet Gurmeet Ram Rahim in jail in Rohtak. A special CBI court sentenced Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh to 10 years in prison on Monday after his conviction in a 2002 rape case that triggered violence leaving 38 dead and scores injured in Haryana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X