వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కరోనా ఐసోలేషన్ వార్డులో కామాంధులు, మహిళపై లైంగిక దాడి ?, మృతి, సీసీ టీవీ !

|
Google Oneindia TeluguNews

పాట్నా/ పంజాబ్: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. కరోనా వైరస్ వ్యాధిని జయించడానికి ఆ వ్యాధి సోకిన వారు మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీహార్ లోని పాట్నాలోని కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ అనుమానిత వ్యాధి లక్షణాలు ఉన్న మహిళ మీద లైంగిక దాడి చేశారని వెలుగు చూసింది. ఐసోలేష్ వార్డు నుంచి ఇంటికి వెళ్లి రెండు రోజుల్లో ఆ మహిళ మరణించడంతో ఆమె బంధువులు, వైద్యులు హడలిపోయారు. సీసీటీవీ కెమెరాల్లోని ఆధారాలతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు.

వరుసకి అన్నతో కాలేజ్ లో లవ్, ఇద్దరిని నగ్నంగా చూసిన అక్క, నరాలు కత్తిరించి హత్య, నాటకాలు!వరుసకి అన్నతో కాలేజ్ లో లవ్, ఇద్దరిని నగ్నంగా చూసిన అక్క, నరాలు కత్తిరించి హత్య, నాటకాలు!

 25 ఏళ్ల పంజాబ్ మహిళ

25 ఏళ్ల పంజాబ్ మహిళ

పంజాబ్ లోని లూథియానకు చెందిన 25 ఏళ్ల మహిళ, ఆమె భర్త మార్చి 25వ తేదీ బీహార్ లోని గయా జిల్లాకు వెళ్లారు. ఈమెకు రెండు నెలల క్రితం అబార్షన్ అయ్యింది. అబార్షన్ కావడంతో ఆమెకు తీవ్రంగా రక్తం పోయి అనారోగ్యానికి గురైయ్యింది. ఆమెను మార్చి 27వ తేదీ పాట్నాలోని ఆసుపత్రికి తరలించారు.

 కరోనా వైరస్ అనుమానం ?

కరోనా వైరస్ అనుమానం ?

అబార్షన్ కారణంగా ఆసుపత్రికి వెళ్లిన మహిళకు కరోనా వైరస్ ఏమైనా సోకిందా ? అనే అనుమానంతో ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. తరువాత ఆమె మహిళను ఐసీయూకు తరలించి చికిత్స చేశారు. ఏప్రిల్ 1వ తేదీ ఆమెను కరోనా ఐసోలేషన్ వార్డుకు తరలించి ప్రత్యేక చికిత్సలు చేశారు.

 మహిళపై లైంగిక దాడి !

మహిళపై లైంగిక దాడి !

ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మహిళ దగ్గరకు ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఎవ్వరినీ అనుమతించలేదు. వైద్యులు, నర్సులు మాత్రం వెళ్లి ఆమెకు చికిత్స చేశారు. ఏప్రిల్ 2, 3వ తేదీల్లో రాత్రిపూట మహిళ మీద పదేపదే లైంగిక దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. తరువాత మహిళకు కరోనా వైరస్ లేదని చెప్పిన వైద్యులు ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేశారు.

 వైద్యుల పనేనా ?

వైద్యుల పనేనా ?

ఇంటికి వెళ్లిన మహిళ పదేపదే ఒత్తిడికి గురైనారని ఆమె అత్త అంటున్నారు. చికిత్స చెయ్యడానికి వచ్చిన వైద్యులు రెండు రోజులు రాత్రిపూట తన మీద పదేపదే లైంగిక దాడి చేశారని ఆ మహిళ తనకు చెప్పిందని ఆమె అత్త ఆరోపిస్తున్నారు. అబార్షన్ కావడం వలనే మహిళ అనారోగ్యానికి గురైయ్యిందని, త్వరలో కోలుకుంటుందని ఆమె కుటుంబ సభ్యులు వేచి చూశారు.

 ఇంట్లో మహిళ మృతి

ఇంట్లో మహిళ మృతి

ఇంటికి వెళ్లిన తరువాత రెండు రోజులు తీవ్రంగా రక్తం పోవడంతో ఆమె మృతి చెందింది. ఐసోలేషన్ వార్డులో మహిళ చికిత్స పొందుతున్న సమయంలో మమ్మల్ని ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదని, తన మీద వైద్యులు లైంగిక దాడి చేశారని మహిళ చెప్పిందని ఆమె అత్త ఆరోపిస్తున్నారు. మహిళ అత్త ఆరోపణలు చెయ్యడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.

 నకిలీ వైద్యులు వచ్చారా ?

నకిలీ వైద్యులు వచ్చారా ?

వ్యాధి నయం అవుతుందని చెప్పి ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారని, ఇంటికి వెళ్లిన రెండు రోజుల తరువాత ఆమె మృతి చెందిందని ఆమె అత్త ఆరోపించారు. ఈ విషయంపై ఆసుపత్రి సీనియర్ వైద్యుడు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తాము సీరియస్ గా తీసుకున్నామని అన్నారు. ఇద్దరు వ్యక్తులు రాత్రిపూట ఐసోలేషన్ వార్డులోకి వెళ్లినట్లు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆసుపత్రి వైద్యుడు చెప్పారు. సీసీ కెమెరాలోని క్లిప్పింగ్స్ ఆధారంగా తాము కేసు విచారణ చేస్తున్నామని పాట్నా పోలీసు అధికారులు తెలిపారు.

Recommended Video

Lockdown Extension Exit: Need To Balance Lives And Livelihood

English summary
Coronavirus: Migrant woman was sexually abused in COVID 19 isolation ward at patna in bihar. that women was died says police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X