వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీన్స్ ప్యాంట్, టీషర్టు: ఆర్ టీసీ బస్ స్టాండ్ లో వేట కొడవలితో మహిళ, తల లేపేస్తా!

|
Google Oneindia TeluguNews

చిక్కమగళూరు (కర్ణాటక): ప్రత్యర్థులను భయపెట్టడానికి కొందరు వేటకొడవళ్లు చేతపట్టుకుని నానా హంగామా చేస్తుంటారు. జీన్స్ ప్యాంట్, ఖరీదైన టీషర్టు వేసుకున్న ఓ మహిళ ఆర్ టీసీ బస్ స్టాండ్ లో వేటకొడవలి చేతిలో పెట్టుకుని దగ్గరకు వస్తే మీ తల నరికేస్తా అంటూ హంగామా చేసి చివరికి చాకచక్యంగా తప్పించుకుంది.

కర్ణాటకలోని చిక్కమగళూరు నగరంలోని కేఎస్ఆర్ ఆటీ బస్ స్టాండ్ లో ఆదివారం అర్దరాత్రి ఓ మహిళ వేటకొడవలి చేతిలో పెట్టుకుని ప్రయాణికులు, పోలీసులకు సినిమా చూపించింది. అర్దరాత్రి కేఎస్ఆర్ టీసీ బస్ స్టాండ్ లోకి ఓ మహిళ ఒంటరిగా వెళ్లింది.

జీన్స్ ప్యాంట్, ఖరీదైన టీషర్టు వేసుకున్న మహిళ బస్ స్టాండ్ ఆవరణంలో ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ లో నుంచి వేటకొడవలి బయటకు తీసింది. అక్కడ ఉన్న ప్రయాణికులు వేటకొడవలిని బ్యాగ్ లో పెట్టాలని ఆమెకు సూచించారు.

 a woman was walking with a weapon in Chikmagalur bus stop

అయితే ఆ మహిళ వేటకొడవలి చేతిలో పట్టుకుని అటుఇటు తిరిగింది. ప్రయాణికులు ఆమె చేతిలో ఉన్న వేటకొడవలి లాక్కోవడానికి ప్రయత్నించారు. అంతే రెచ్చిపోయిన ఆ మహిళ దగ్గరకు వస్తే మీ తలలు తెగిపోతాయని వారిని హెచ్చరించింది.

మహిళ ఎక్కడ దాడి చేస్తుందో అంటు ఆందోళన చెందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గస్తి తిరుగుతున్న పోలీసులు ఆర్ టీసీ బస్ స్టాండ్ చేరుకుని వేటకొడవలి ఇవ్వాలని మహిళకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.

ఆమె మాత్రం వేటకొడవలి ఇవ్వడానికి నిరాకరించింది. మహిళ చేతిలో ఉన్న వేటకొడవలి లాక్కోవడానికి పోలీసులు ప్రయత్నించి విఫలం అయ్యారు. దగ్గరకి వస్తే మీ తలలు తెగిపోతాయి అంటూ పోలీసులు, ప్రయాణికుల మీద ఆమె కేకలు వేసింది.

ప్రయాణికులు, పోలీసుల కళ్లు గప్పిన మహిళ చిన్నగా బస్ స్టాండ్ నుంచి బయటకు వెళ్లిపోయి చికటిలో పారిపోయింది. బస్ స్టాండ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆమె చేసిన హంగామా క్లిప్పింగ్స్ రికార్డు అయ్యాయి. మానసిక అస్వస్థతకు గురైన మహిళ వేటకొడవలితో హంగామా చేసి ఉంటుందని, సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ ఆధారంగా ఆమె ఆచూకి కోసం గాలిస్తున్నామని సోమవారం చిక్కమగళూరు పోలీసులు తెలిపారు.

English summary
Karnataka: Sunday night a woman was walking with a weapon in Chikmagalur bus stop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X