వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పి ఇంట్లోకి రా: శబరిమలలోకి వెళ్లిన కనకదుర్గకు అత్తింటివారు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కోట్లాది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, హిందువుల మనోభావాలు దెబ్బతీశారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఇద్దరు యువతుల్లో కనకదుర్గ ఒకరు. ఆమెను అత్తింటి వారు ఇంట్లోకి రానీయడం లేదు. చేసిన పాపానికి శక్ష అనుభవించాలని ఇంటి నుంచి గెంటేశారు.

అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టినందుకు కనకదుర్గ.. అత్త ఆమెపై గతంలో చేయి చేసుకున్నారు. తాజాగా, కనకదుర్గను ఇంట్లోకి రానీయడం లేదు. దీంతో ప్రస్తుతం ఆమె కేరళలోని పథనమ్‌తిట్ట జిల్లాలోని ఓ ప్రభుత్వ గృహంలో ఉంటోంది. ఈ విషయాన్ని కనకదుర్గతో పాటు ఆలయంలోకి ప్రవేశించిన బిందు వెల్లడించారు.

Woman who entered Sabarimala temple disowned by family

కనకదుర్గ తమతో అబద్ధం చెప్పి ఆలయంలోకి వెళ్లిందని ఆమె అత్తింటివారు అంటున్నారని, ముందుగా ప్లాన్‌ చేసుకుని తిరువనంతపురంలో జరుగుతున్న సమావేశానికి హాజరువుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిందని చెబుతున్నారని, అందుకే తనను ఇంట్లోకి రానివ్వడం లేదని బిందు అన్నారు.

ఇటీవల కనకదుర్గకు, బిందుకు 24 గంటలూ భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు కనకదుర్గ అత్తింటి వారికి నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ వారు అంగీకరించలేదు. కనకదుర్గ అయ్యప్ప భక్తులకు బహిరంగంగా క్షమాపణలు చెబితే ఇంట్లోకి రానిస్తామని ఆ కుటుంబం తెలిపింది.

English summary
Kanakadurga, one of the two women who entered Sabarimala Lord Ayyappa shrine on January 2, has been disowned by her family and thrown out of her home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X