వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరచిన పామును చేతపట్టుకుని ఆసుపత్రికి చేరుకున్న మహిళలు

|
Google Oneindia TeluguNews

పాము కరిచిన మహిళలు ఏకంగా పామును చేతిలో పట్టుకుని టాక్సీలో ఆసుత్రికి చేరిన సంఘటన ముంబాయిలో జరిగింది. ఆసుపత్రికి చేరిన తల్లీ కూతుళ్లు అనంతరం పామును ఆసుపత్రి డాక్టర్లకు అందించారు. దీంతో ఆవాక్కయిన డాక్టర్లు పాము కాటుకు గురైన మహిళలను చికిత్స అందిస్తున్నారు.. ఇక పామును పాయిజన్ తనిఖీ విభాగానికి అప్పగించారు.

మెరుగైన చికిత్స కోసం కాటు వేసిన పాముతో...

మెరుగైన చికిత్స కోసం కాటు వేసిన పాముతో...

మనుష్యులను ఎప్పుడు పాములు గాని, లేదా విషపు పురుగులు గాని కుట్టినప్పుడు లేదా పాయిజన్ తీసుకున్నప్పుడు ,దానికి సంబంధించిన జాతులు తెలిస్తే లేదంటే విషం తాగితే సంబంధిత బాక్స్‌ను తీసుకెళతారు. ఇలా చేయడం వల్ల చికిత్స అందించేందుకు డాక్టర్లు సులువతుంది. దీంతో ఇదే అంశాన్ని గుర్తు పెట్టుకున్న ఇద్దరు మహిళలు కరచిన పామును చేత పట్టుకుని వైద్యం కోసం ఆసుపత్రి వచ్చారు.

ముంబాయిలో ఇటివల వర్షాలకు ఇళ్లలోకి చేరిన పాములు

ముంబాయిలో ఇటివల వర్షాలకు ఇళ్లలోకి చేరిన పాములు

ఇటివల ముంబాయిలోని దార్వీపూర్ ఏరియాలో ఇటివల కురిసిన వర్షాలకు చెట్ల పోదల్లో ఉండాల్సిన పాములు ఇళ్లలోకి చేరాయి. ఈ నేపథ్యంలోనే ముంబాయిలోని బాల్కాపూర్ ప్రాంతంలోని దార్వీపూర్‌లోని మహారాష్ట్ర నేచర్ పార్క్ సమీపంలో సుల్తానా ఖాన్ కుటుంభం నివసిస్తుంది. ఈనేపథ్యంలోనే తన నివాసంలో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో 18 సంవత్సరాలు ఉన్న సుల్తానా కూతురు కాలుపై పాము కాటు వేసింది. అయితే పాము కుట్టిన విషయాన్ని పసిగట్లలేక పోయారు. ఏదో ఎలుక కాటు కరిచిందని భావించారు. అయితే కాసేపటి తర్వాత పాము ఇంట్లో కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన సుల్తానా వెంటనే రెండు అడుగులు ఉన్న పామును పట్టుకున్నారు.

కాటు వేసిన పాము జాతిని డాక్టర్లకు తెలిపేందుకు

కాటు వేసిన పాము జాతిని డాక్టర్లకు తెలిపేందుకు

అయితే సుల్తానా పామును పట్టుకునే సమయంలోనే సుల్తానాను కూడ మరోసారి పాము కాటు వేసింది. అయినా సరే దాన్ని విడవకుండా వెంటనే ట్యాక్సీ మాట్లాడుకుని ముంబాయిలోని సియోన్ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం పామును డాక్టర్లకు అందించింది. దీంతో అవాక్కయిన డాక్టర్లు పామును పాయిజన్ తనీఖి విభాగానికి అప్పగించిన అనంతరం మహిళలకు చికిత్సను అందించారు..కాగా కాటు వేసిన విషపు పాములు జాతీని తెలుసుకోవడం ద్వార సరైన చికిత్స అందుతుందనే ఆలోచనతోనే పామును ఆసుపత్రికి తీసుకువచ్చామని తెలిపారు.

English summary
In a curious incident reported from Mumbai's Dharavi area, an 18-year-old girl and her mother were bitten by a snake and instead of getting panicked, the alerted woman held the snake in her hand and reached hospital to help the doctor provide proper treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X