వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒళ్ళంతా కప్పే దుస్తులతోనే రావాలని ఢిల్లీ ఐఐటీ విధ్యార్థినులకు వార్డెన్ నోటీసు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏడాదికి ఒక్కసారి జరిగే హౌస్ డే కార్యక్రమంలో విధ్యార్థినులు అతిథులను ఆహ్వనించేందుకుగాను ఒళ్ళంతా నిండుగా కప్పుకొనే దుస్తులు వేసుకొని రావాలి ఢిల్లీ ఐఐటీ మహిళా హాస్టల్ వార్డెన్ విధ్యార్థినులను ఆదేశించారు.

ఈ నెల 20వ, తేదిన ఢిల్లీలోని మహిళ ఐఐటీలో హౌస్ డే నిర్వహించనున్నారు. అయితే ఈ హౌస్ డే కు అతిథులను పిలవాల్సి ఉన్నందున విధ్యార్థినులు ఒంటినిండా కప్పుకొనే దుస్తులను ధరించి రావాలని హాస్టల్ వార్డెన్ నోటీసిచ్చింది.

హాస్టళ్ళు, యూనివర్శిటీలు, కాలేజీల్లో మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడే పింజ్రా టాడ్ అనే సంస్థ ఈ నోటీసును వాట్సాస్ లో అందరికీ షేర్ చేసింది.

Women at IIT Delhi hostel told to attend event in ‘full covered, decent dresses’

మహిళలు ధరించే దుస్తుల గురించి హాస్టల్ వార్డెన్లు ఎందుకంత ఖచ్చితంగా వ్యవహరించాలని సంస్థ సభ్యురాలు ప్రశ్నించారు.ఐఐటీ ఢిల్లీలో హిమాద్రి, కైలాష్ అనే రెండు అమ్మాయిల హాస్టళ్ళున్నాయి. ఇలాంటి నోటీసు ఒకటి పెట్టడం ఇదే తొలిసారి. గతంలో కూడ తమకు పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు వేసుకురావాలని నోటి మాటగానే చెప్పారని విధ్యార్థినులు గుర్తు చేశారు.

అయితే ఇలా నోటీసు పెట్టడం మాత్రం ఇదే తొలిసారని బీటెక్ ఫైనలియర్ విధ్యార్థిని ఒకరు చెప్పారు. ఇంతకుముందు చాలాసార్లు ఇలాగే చెప్పేవారని, అయితే వాటిని ఎవరూ పాటించిన దాఖలాలులేవు. అయితే వీటిని పాటించకపోతే ఎవరినీ ఇంతవరకు శిక్షించిన పాపాన కూడ పోలేదన్నారు. మరో మాజీ విధ్యార్థిని తెలిపారు.

English summary
A women’s hostel at the Indian Institute of Technology, Delhi has put up a notice asking women to wear “full covered decent western or Indian dresses” on their house day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X