వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్‌పై చర్యకు డీజీపీకి లేఖ రాసిన మహిళా కమిషన్

హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తపై హ‌ర్యానా మ‌హిళా క‌మిష‌న్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తపై హ‌ర్యానా మ‌హిళా క‌మిష‌న్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా హ‌నీప్రీత్ మీద ఆరోప‌ణ‌లు చేసి, ఆమె ప‌రువు తీస్తున్నాడంటూ హర్యానా మహిళా కమిషన్ ఆరోపణలు చేసింది.

Recommended Video

డేరాబాబా బెడ్ రూంలో నగ్నంగా తిరుగుతూ వీడియో తీయించిన హనీప్రీత్? | Oneindia Telugu

డేరా బాబాకు, త‌న మాజీ భార్య హ‌నీప్రీత్‌కు మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉందంటూ మీడియా స‌మావేశం పెట్టి హనీప్రీత్ మాజీ భ‌ర్త విశ్వాస్ గుప్త వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

Women commission seeks action against Honeypreet’s ex-husband for ‘defaming’ her character

ఈ విష‌యంలో ఎలాంటి ఆధారాలు లేకుండా హ‌నీప్రీత్ మీద ఆరోప‌ణ‌లు చేసి, ఆమె ప‌రువు తీస్తున్నాడంటూ హ‌ర్యానా మ‌హిళా క‌మిష‌న్ ఆరోపించింది. దీనికి సంబంధించి విశ్వాస్ గుప్త మీద వెంట‌నే చ‌ర్య తీసుకోవాల‌ని లేఖ రాసింది. ఈ మేర‌కు బీజేపీ నాయ‌కురాలు, మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ ప్ర‌తిభ సుమ‌న్‌, హ‌ర్యానా డీసీపీ బీఎస్ సాంధూకి లేఖ రాసిన‌ట్లు పేర్కొన్నారు.

2009లోనే హ‌నీప్రీత్‌కి విడాకులిచ్చిన విశ్వాస్, ఇప్పుడు ఆమెపై నింద‌లు వేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అని ఆమె ప్ర‌శ్నించారు. విశ్వాస్ గుప్త మీడియా స‌మావేశం గురించి చేసిన‌ ఫిర్యాదు తీసుకుని మాన‌వ హ‌క్కుల గ్రూపు లాయ‌ర్లు త‌నను ఆశ్ర‌యించార‌ని ఆమె చెప్పారు. వారి వినతి మేర‌కే తాను లేఖ రాసిన‌ట్లు ప్ర‌తిభ సుమ‌న్ పేర్కొన్నారు.

English summary
Haryana State Women Commission has sought action against Vishwas Gupta, the ex-husband of Honeypreet Insan, for defaming her character in public by levelling allegations against her without any proof. BJP leader and chairperson of the women commission, Pratibha Suman, has written a letter to Haryana DGP BS Sandu, requesting him to book Gupta in suitable sections and send a compliance report to the commission within seven days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X