కరోనా వేళ మరో కొత్త టెన్షన్.. కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం..
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండం చేస్తోంది. కేసుల తీవ్రతతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌తో జనం గుండెల్లో దడ పుట్టిస్తుంటే.. ఇప్పుడు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ మరో కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.

మంకీ ఫీవర్ కలవరం
కర్ణాటకలోని
షిమెగా
జిల్లాలో
తాజాగా
ఒక
మహిళ
తీవ్ర
జ్వరం,
వాంతులు,
ఒళ్లు
నొప్పులతో
బాధపడుతూ
స్థానిక
ఆస్పత్రిలో
చేరింది.
అప్పటి
నుంచి
ఆ
మహిళకు
వైద్యులు
చికిత్స
అందిస్తున్నారు.
ఎంతకీ
జ్వరం
నుంచి
కోలుకోకపోవడంతో..
వైద్యులు
పరీక్షలు
నిర్వహించారు.
రిపోర్టులో
సదరు
మహిళకు
మంకీ
ఫీవర్
సోకినట్లు
డాక్టర్లు
నిర్థారణకు
వచ్చారు.
ఈ
విషయాన్ని
శివమొగ్గ
ఆరోగ్య
అధికారి
రాజేష్
సురగిహల్లి
వెల్లడించారు.
దీనిని
క్యాసనూర్
ఫారెస్ట్
డిసీజ్
అని
కూడా
అంటారని
తెలిపారు.
గతంలో 26 మంది మృతి
కర్ణాటకలో
ఈ
మంకీ
ఫీవర్
కేసులు
2022లో
తొలి
సారిగా
నమోదయ్యాయి.
రాష్ట్రంలోని
సాగర్
మండలం,
అరలగోడులో
అనేక
మంది
ఈ
మంకీ
జ్వరం
భారిన
పడ్డారు.
అప్పుడు
దాదాపు
26
మంది
వరకు
మరణించారు.
అప్పుడు
కర్ణాటక
ప్రభుత్వం
అప్రమత్తం
అయి
..
చర్యలు
తీసుకుంది.
అనంతరం
ఇప్పటి
వరకు
ఇలాంటి
కేసులు
బయటపడలేదు..
అయితే
తాజాగా
ఇప్పుడు
మరో
సారి
ఈ
మంకీ
ఫీవర్
కేసు
బయటపడింది.

మంకీ ఫీవర్ లక్షణాలు.. వ్యాప్తి
ప్రస్తుతం మంకీ ఫీవర్ సోకిన సదరు మహిళను తీర్థహళ్లి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ వైరస్ బయటపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ కోతుల ద్వారా మనుషులకు సోకుతుంది. ఈ మంకీ వైరల్ వచ్చిన వారికి అధిక జ్వరం, కళ్లు మంటలు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. ఇవి దాదాపు డెంగీ వ్యాధి లక్షణాలను పోలి ఉంటాయని పేర్కొన్నారు. ఈ వైరల్ కారణంగా 10 శాతం వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఒకవైపు కరోనా మహమ్మరితో అల్లాడుతుంటే.. మరో వైపు ఈ మంకీ వైరస్ ప్రజలను భయపెడుతోంది.