వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల ఇష్యూ: భక్తులకు కౌంటర్‌గా 620 కి.మీ. మహిళల మానవ హారం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sabarimala Temple : 2 Women Below 50 Enter Sabarimala, Video Viral

తిరువనంతపురం: శబరిమలలోకి అందరి మహిళలను అనుమతిస్తూ కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అయ్యప్ప స్వామి భక్తులు, హిందూ సంస్థలు గత కొద్ది రోజులుగా కేరళలో నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసలకు భారీ మద్దతు లభిస్తోంది. సుప్రీం తీర్పును నిరసిస్తూ మహిళలు సహా లక్షలాది మంది రోడ్డెక్కారు.

అయితే దీనికి కౌంటర్‌గా కేరళలో పినరాయి విజయన్ ప్రభుత్వం మద్దతుతో మహిళలు రోడ్ల పైకి వచ్చారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమ వయస్సులోను మహిళలను కూడా వెళ్లనివ్వాలన్న సుప్రీం తీర్పుకు మద్దతుగా 620 కిలో మీటర్ల పొడవైన 'మహిళా గోడ' (ఉమెన్ వాల్) కట్టారు.

పినరాయి ప్రభుత్వ మద్దతుతో లక్షలాది మహిళలు రోడ్లపై వచ్చి మానవ హారంగా ఏర్పాడి నిల్చున్నారు. కొత్త ఏడాది ఆరంభం సందర్భంగా ఈ రోజున కాసర్‌గడ్ నుంచి రాష్ట్ర రాజధాని తిరువనంతపురం వరకు మహిళా హారం ఏర్పడింది. శబరిమలలోకి మహిళలు రావొద్దన్న నిరసనలకు దీటుగా, సుప్రీం బాటలో లింగసమానత్వం కోసం దీనిని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.

Womens wall in Kerala: Lakhs of women line up for Vanitha Mathil across state

సుప్రీం కోర్టు తీర్పును నిరసిస్తూ గత డిసెంబర్ 26వ తేదీన అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు 800 కిలో మీటర్ల పొడవున అయ్యప్ప జ్యోతిని వెలిగించారు. అయ్యప్ప భక్తులు, మహిళలు, పిల్లలు మానవహారంగా ఏర్పడ్డారు. దానికి ధీటుగా ఇప్పుడు 620 కిలో మీటర్ల మేర ఉమెన్ వాల్ నిర్వహించారు.

తిరువనంతపురంలో మానవహారం చివరన సీపీఐ నాయకురాలు బృందాకారత్ నిల్చొని.. లింగసమానత్వంపై మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. అధికార పార్టీ మద్దతుతో లక్షలాది మంది ఈ వుమెన్ వాల్‌లో పాల్గొన్నారు.

English summary
Marshalled by the Kerala government and a section of Hindu organisations the wall is being organised against the backdrop of the Supreme Court verdict on women's entry to the Sabarimala temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X