వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమెకు శీలం లేదు, తిరుగుబోతు, పోస్టర్లు వేసి ప్రచారం చేశాడు, చెప్పు తెగిపోయే వరకు చితకబాదింది!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చికమగళూరు: మహిళకు శీలం లేదని, ఆమె చెడిపోయిందని, అనేక మందితో తిరుగుతున్నదని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ పోస్టుర్లు అంటించి కరపత్రాలు పంచుతున్న సైకోకు దేహశుద్ది చేశారు. ఎన్నికల ప్రచారం చేసినట్లు ఇంటింటికి తిరిగి ఆ మహిళ గురించి చెడుగా ప్రచారం చేస్తున్న నీచుడిని పట్టుకున్న మహిళ చెప్పు తెగిపోయే వరకు చితకబాదిన సంఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు సమీపంలో జరిగింది.

నటితో అక్రమ సంబంధం, రెచ్చిపోయిన మాజీ ప్రియుడు, రాత్రి చెల్లెలుకు సెగ, ఫ్యామిలీతో కలిసి ఫినిష్!నటితో అక్రమ సంబంధం, రెచ్చిపోయిన మాజీ ప్రియుడు, రాత్రి చెల్లెలుకు సెగ, ఫ్యామిలీతో కలిసి ఫినిష్!

ఒంటరిగా మహిళ నివాసం

ఒంటరిగా మహిళ నివాసం

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కోప్ప తాలుకాలోని జయపురంలో ఓ మహిళ (30) ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ మహిళ మీద కన్ను వేసిన సుందరేశ్ ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అయితే ఆ మహిళ మాత్రం సుందరేశ్ ప్రలోభాలకు లొంగకుండా అతన్ని దూరం పెడుతూ వస్తోంది.

మహిళకు శీలం లేదు, తిరుగుబోతు

మహిళకు శీలం లేదు, తిరుగుబోతు

మహిళ ఎంత కాలానికి లొంగకపోవడంతో సుందరేశ్ రగిలిపోయాడు. తనతో కాకుండా ఆ మహిళ వేరేవాళ్లతో తిరుగుతోందని సుందరేశ్ కు అనుమానం పెరిగిపోయింది. ఎలాగైనా ఆ మహిళకు చుట్టుపక్కల చెడ్డపేరు తీసుకురావాలని నిర్ణయించాడు. అంతే మహిళకు శీలం లేదని, తిరుగుబోతు అని ప్రచారం చెయ్యడం మొదలు పెట్టాడు.

రోడ్డు పక్కన పోస్టర్లు, కరపత్రాలు

రోడ్డు పక్కన పోస్టర్లు, కరపత్రాలు

మహిళకు శీలం లేదని, ఆమె తిరుగుబోతు అని మీరు ఆమెను దూరం పెట్టాలని ముద్రించిన పోస్టర్లను సుందరేశ్ రోడ్డు పక్కన, ఇంటి గోడల మీద అతికించాడు. అంతే కాకుండా సుందరేశ్ ఆ మహిళతో మీరు మాట్లాడినా, చనువుగా ఉన్నా ఆమెలాగే మీరు చెడ్డపేరు తెచ్చుకుంటారని, జాగ్రత్తగా ఉండాలని ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంచడం మొదలు పెట్టాడు.

చెప్పు తెగిపోయే వరకు చితకబాదింది !

చెప్పు తెగిపోయే వరకు చితకబాదింది !

సుందరేశ్ తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆ మహిళ గుర్తించింది. అంతే ఇంటింటికి కరపత్రాలను పంచుతున్న సుందరేశ్ ను నడిరోడ్డులో ఆ మహిళ పట్టుకుంది. తాను ఎవ్వరితో తిరుగుతున్నానని, నా కారణంగా ఎంత మందికి చెడ్డపేరు వచ్చింది చెప్పు అంటూ సుందరేశ్ ను నిలదీసింది. సమాధానం చెప్పలేక సుందరేశ్ నీళ్లు నమలడంతో ఆ మహిళ కోపం పట్టలేక కాలిలోని చెప్పులు తీసుకుని అవి తెగిపోయే వరకు సుందరేశ్ ను చితకబాదింది. స్థానికులు మహిళకు నచ్చచెప్పి సుందరేశ్ ను పోలీసులకు అప్పగించారు. మహిళ గురించి చెడుగా ప్రచారం చెయ్యడానికి ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Women slaps a man who distribute brochure suspecting her character in jayapura of Chikkamagaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X