• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళల సత్తా.. పురుషుల సైనిక దళానికి హైదరాబాదీ నాయకత్వం

|

న్యూఢిల్లీ : ఆడవాళ్లంటే వంటింటికి పరిమితం అనేది ఒకప్పటి మాట. ఆడవాళ్లు తలచుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారనేది నేటి మాట. మారుతున్న కాలంలో మహిళలు దూసుకెళుతున్నారు. రంగం ఏదైనా తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఆ క్రమంలో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో మహిళలు చురుకైన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.

చరిత్ర సృష్టించిన మహిళల పరేడ్

70వ గణతంత్ర దినోత్సవంలో మహిళా దళం కవాతు రికార్డు క్రియేట్ చేసింది. రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్న అసోం రైఫిల్స్ దళంలో మొత్తం మహిళలే ఉండటం విశేషం. అతి చిన్న వయసులో 30 ఏళ్లున్న మేజర్ కుష్బూ కన్వార్ నేతృత్వం వహించి శభాష్ అనిపించుకున్నారు. మహిళా దళం కవాతుకు నేతృత్వం వహించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు కుష్బూ. రాజస్థాన్ కు చెందిన తాను బస్ కండక్టర్ కూతురునంటూ చెప్పుకొచ్చారు. సాధన, పట్టుదలతో మహిళలు ఏదైనా సాధించొచ్చని అన్నారు.

గణతంత్ర దినోత్సవంలో అసోం నుంచి మహిళలతో కూడిన రైఫిల్స్ దళం పాల్గొనడం ఇదే ఫస్ట్ టైమ్. అందులో చాలామంది సైనిక కుటుంబాలకు చెందినవారు కావడం విశేషం. సైన్యంలో ఉండి చనిపోయిన ఫ్యామిలీల నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు.

 హైదరాబాద్ ఆణిముత్యం

హైదరాబాద్ ఆణిముత్యం

రిపబ్లిక్ డే పరేడ్ లో మరో విశేషం చోటుచేసుకుంది. 144 మంది ఇండియన్ ఆర్మీ పురుషుల దళాన్ని లీడ్ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందారు హైదరాబాద్ కు చెందిన భావన కస్తూరి. స్వాతంత్ర్యం వచ్చిన 71 ఏళ్ల తర్వాత పురుషుల సైనిక దళానికి మహిళ నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి. 26 ఏళ్ల వయస్సున్న భావన.. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. చదువుతో పాటు డ్యాన్స్, పాటలు.. ఇలా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. క్లాసికల్ డ్యాన్స్ లో డిప్లొమో కూడా తీసుకున్నారు. భారత సైన్యంలో సర్వీస్ కార్ప్స్ లో లెఫ్టినెంట్ ర్యాంకులో ఉన్న భావన.. తనకు ఈ అవకాశం దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు. తాను అమ్మాయినంటూ కొందరు పదేపదే గుర్తు చేసినా.. ఫ్యామిలీ మెంబర్స్ సాయంతోనే ఇంతవరకు చేరుకున్నానని చెబుతున్నారు భావన.

డిఫెన్స్ లో రాణిస్తున్న మహిళలు

డిఫెన్స్ లో రాణిస్తున్న మహిళలు

భారత సైనిక దళంలో మహిళలు రాణించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతంలో డిఫెన్స్ సర్వీస్ అంటే పురుషులు సైతం భయపడుతుండేవారు. అలాంటిది కాలం మారుతున్న క్రమంలో, తాము దేనికి తీసిపోమంటూ మహిళలు కూడా డిఫెన్స్ లో చేరేందుకు ముందుకొస్తున్నారు. కఠినతరమైన శిక్షణను తట్టుకుని, తమకు అప్పగించిన బాధ్యతలను సవ్యంగా, సాఫీగా నెరవెరుస్తున్నారు. అవకాశముంటే చాలు ఏ రంగంలోనైనా దూసుకెళతామని నిరూపిస్తున్నారు.

English summary
In the 70th Republic Day, the Women's Army has set a march. At the age of 30, Major Kushboo Kanwar lead the team. The Hyderabad's woman to be the first lady to lead the Indian men's army. This is the first time that the woman headed the men's army in 71 years of independence history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X