వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ విమానమైనా దిగనివ్వం: బీజేపీ ఎమ్మెల్యే షాక్

ప్రధాని నరేంద్ర మోడీ సహా వీఐపీలు ఎవరు కూడా ఇక్కడ దిగడానికి తాము అంగీకరించేది లేదని బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రాజావత్ హెచ్చరించారు. రాజస్థాన్‌లోని కోటాకి ఇప్పటికీ విమానయాన సౌకర్యం లేదు.

|
Google Oneindia TeluguNews

కోట: ప్రధాని నరేంద్ర మోడీ సహా వీఐపీలు ఎవరు కూడా ఇక్కడ దిగడానికి తాము అంగీకరించేది లేదని బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రాజావత్ హెచ్చరించారు. రాజస్థాన్‌లోని కోటాకి ఇప్పటికీ విమానయాన సౌకర్యం లేదు.

అక్కడున్న చిన్న విమానాశ్రయంలో వీఐపీలు, రాజకీయ నాయకుల విమానాలు దిగడానికి మాత్రమే వెసులుబాటు ఉంది. ఈ విషయంపై సదరు బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

<strong>యూపీ బీజేపీ వైపు?: అఖిలేష్ తప్పటడుగు అక్కడే</strong>యూపీ బీజేపీ వైపు?: అఖిలేష్ తప్పటడుగు అక్కడే

Won’t allow PM’s plane to land in Kota: BJP MLA

కోటాలో అన్ని సౌకర్యాలతో ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చేవరకు ప్రముఖుల విమానాలను కూడా ఇక్కడ దిగేందుకు అనుమతులు ఇవ్వద్దన్నారు. ప్రధాని విమానం కూడా దిగనిచ్చేది లేదని తేల్చి చెప్పారు.

కోటాలో పాస్‌పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సరైన విమానాశ్రయమే లేనప్పుడు పాస్‌పోర్టులు తీసుకొని ప్రజలు ఏం చేసుకుంటారని ప్రశ్నించారు.

కోటా విమానాశ్రయం కేవలం ప్రముఖుల విమానాలు దిగేందుకే ఉపయోగపడుతోందని, ప్రజల కోసం కాదని, ప్రజల కోసం అన్ని సౌకర్యాలతో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేంత వరకు ప్రధాని విమానాన్ని కూడా ఇక్కడ దిగనివ్వమన్నారు.

English summary
BJP MLA Bhawani Singh Rajawat threatened to not let aircraft of VIPs, including that of the Prime Minister, land in Kota, expressing displeasure over lack of air connectivity to the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X