వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ముందు మోకరిల్లేది లేదు, జైలుకే వెళ్తా: శరద్ పవార్ సంచలనం

|
Google Oneindia TeluguNews

ముంబై: మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యేందుకు, జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్దమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. శరద్ పవార్, ఆయన అన్న కొడుకు అజిత్ పవార్‌పై బ్యాంకు స్కాం కేసులో ఈడీ కేసులు నమోదు చేసింది.

రూ.25వేల కోట్ల బ్యాంక్ స్కాంలో శరద్ పవార్ మేనల్లుడురూ.25వేల కోట్ల బ్యాంక్ స్కాంలో శరద్ పవార్ మేనల్లుడు

మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్(ఎంఎస్‌సీబీ)లో రూ. 25వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి శరద్ పవార్, అజిత్ పవార్‌పై కేసు నమోదు చేసిన నేపథ్యంలో శరద్ పవార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను ఏ క్షణానికైనా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

 Won’t bow down before Delhi, ready for ED hospitality: Sharad Pawar

అయితే తాను ఢిల్లీ(నరేంద్ర మోడీ ప్రభుత్వం)కి మోకరిల్లేది లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 27న ఈడీ ముందు హాజరయ్యేందుకు, వారి ఆతిథ్యం తీసుకునేందుకు కూడా తాను సిద్ధమేనని వెల్లడించారు. తనకు సంబంధం లేని కుంభకోణంలో తన పేరును చేర్చినందుకు ఈడీకి ధన్యవాదాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తనను జైలుకు పంపేందుకు కొంతమంది కుట్రపూరితంగా ప్రణాళికలు రచిస్తున్నారని శరద్ పవార్ ఆరోపించారు. త్వరలో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో క ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని శరద్ పవార్ పై బ్యాంకు కుంభకోణంలో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న వేళ తమపై కుట్ర పూరితంగానే కేసులు నమోదు చేస్తున్నారంటూ బీజేపీపై ఎన్సీపీ, కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎంఎస్‌సీబీలో రైతులకు రుణాల మంజూరులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ముంబై పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటి ఆధారంగా మంగళవారం ఈడీ అప్పటి సీఎం శరద్ పవార్ సహా 2005-17 మధ్య కాలంలో పనిచేసిన ఎంఎస్‌సీబీ డైరెక్టర్లు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తోపాటు 70మంది మాజీ అధికారులపై కేసులు నమోదు చేసింది.

హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్: మాజీ సీఎం, గవర్నర్‌తోపాటు నేతలు, అధికారులూ విటులే!హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్: మాజీ సీఎం, గవర్నర్‌తోపాటు నేతలు, అధికారులూ విటులే!

English summary
NCP president Sharad Pawar on Wednesday said he will visit the Enforcement Directorate office on September 27 to provide information in a money laundering case registered against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X