వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ను అసహన దేశం అనలేం: తస్లిమా నస్రీన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొన్ని సంఘటనలు జరిగినంత మాత్రాన, వాటి ఆధారంగా భారత దేశాన్ని అసహన దేశంగా అభివర్ణించడం సరయినది కాదని బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లిమా నస్రీన్‌ పేర్కొన్నారు. దాద్రీ, కల్బుర్గీ ఘటనలతో పాటు ఝార్ఖండ్‌లోని పశు వికేత్రల హత్యలను ఖండించారు.

ఇది అసహనం కాదని ఆమె చెప్పారు. అవి క్రూరమైన హత్యలు అన్నారు. కొన్ని చెడు ఘటనలతో 124 కోట్ల ప్రజలు ఉన్న భారత్‌ను అసహనంగా అభివర్ణించలేమన్నారు. ప్రతి ప్రాంతంలోను అసహనం ఉన్న వ్యక్తులు ఉండటం సాధారణమేనని అన్నారు.

Won't call India intolerant because of few incidents: Taslima Nasreen

భారత దేశంలో చట్టం, న్యాయం అన్నీ సహనానికి అనుకూలంగానే ఉన్నాయని చెప్పారు. భారత దేశంలో చాలాచోట్ల వివిధ రకాల అసహనం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

చిన్న కులాల పట్ల అగ్రకులాలకు అసహనం, బీదవారి పట్ల ధనవంతుల అసహనం, హోమోసెక్సువల్స్, ట్రాన్సుజెండర్స్ పట్ల ఇంకొందరి అసహనం ఉంటుందని చెప్పారు. ఎక్కడైనా అసహన ఉన్న వారు ఉండటం మామూలే అని చెప్పారు. అయినంత మాత్రాన భారత దేశాన్ని అసహన దేశం అనలేమన్నారు.

English summary
Bangladeshi writer Taslima Nasreen today said "some bad incidents" did not amount to India being called "intolerant" and those indulging in them should be "educated" to be more inclusive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X