వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘చైనా దురాక్రమణ’పై డాక్యుమెంట్ తొలగించిన రక్షణ శాఖ: నిజాలను మార్చలేరంటూ కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రక్షణ శాఖ తన వెబ్‌సైట్‌లో కొద్ది రోజుల క్రితం ఉంచిన డాక్యుమెంట్‌ను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దులో మూడు నెలలుగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత కాలం కొనసాగవచ్చని రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో ఆ డాక్యుమెంట్‌ ఉంచింది.

చైనా దురాక్రమణలపై..

చైనా దురాక్రమణలపై..

అయితే, తాజాగా, రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో ఆ డాక్యుమెంట్ కనిపించకపోవడం విమర్శలకు దారితీసింది. వాస్తవధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మే 5, 2020 నుంచి గల్వాన్ లోయలో చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతగాక, కున్‌గ్రాంగ్ నాలా, గోగ్రా, పాంగ్యాంగ్ సరస్సు పరిసర ప్రాంతాల్లో మే 17, 18 మధ్య చైనా దురాక్రమణలకు పాల్పడిందని ఆ డాక్యుమెంట్‌లో పేర్కొంది.

తొలగింపుపై సమాచారం లేదు..

తొలగింపుపై సమాచారం లేదు..


‘ఎల్ఏసీలో చైనా దురాక్రమణ' అనే శీర్షికతో ఈ డాక్యుమెంట్‌ను రక్షణ శాఖ తన అధికారిక వెబ్‌సైట్లో ఉంచింది. అయితే, దాని తొలగింపు గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని రక్షణ శాఖ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించడం గమనార్హం. ఆ డాక్యుమెంట్‌లో ఎల్ఏసీలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలైన తర్వాత చైనా ఆక్రమణ గురించి అధికారికంగా పేర్కొంది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల సైన్యం మధ్య చర్చలు జరిగినట్లు తెలిపారు. గల్వాన్ లోయ ఘర్షణ గురించి కూడా అందులో ప్రస్తావించారు. ఇంకా జూన్ 6, జూన్ 22న కమాండర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చ జరిగినట్లు కూడా పేర్కొన్నారు.

Recommended Video

Sushant Singh Rajput సూసైడ్ కారణంగా Bollywood Offers, Karan Johar ని దూరం పెట్టిన Prabhas
నిజాలు మార్చలేరంటూ కాంగ్రెస్

నిజాలు మార్చలేరంటూ కాంగ్రెస్


బలగాల ఉపసంహరణకు ఇరుదేశాల మధ్య అంగీకారం జరిగినప్పటికీ, ప్రస్తుత ప్రతిష్టంబన మరికొంత కాలం కొనసాగవచ్చని డాక్యుమెంట్‌లో తెలిపారు. తూర్పు లడఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని, ఈ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని, సరైన సమయంలో తగిన విధంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. అయితే, ఈ డాక్యుమెంట్ ఎందుకు తొలగించిందంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. దీని ద్వారా నిజాలను మార్చలేరంటూ ధ్వజమెత్తింది.

English summary
won't change facts: Congress attacks Centre for removing Chinese intrusion report from website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X