వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోక్యం చేసుకోలేం: మధ్యప్రదేశ్ బలనిరూపణ పరీక్షపై సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార కాంగ్రెస్, పడగొట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఇరుపక్షాలు వేసిన పిటిషన్లను విచారణకు వచ్చింది.

రాజ్యాంగం తమకు కల్పించిన విధులను తాము నిర్వహిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ వ్యవహరాల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని, తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

‘Won’t interfere’: Supreme Court on MP floor test

మధ్యప్రదేశ్ కమల్ నాథ్ ప్రభుత్వంలోని 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ సర్కారు మైనార్టీలో పడిపోయిందని, దీంతో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బెంగళూరులో బీజేపీ బంధించిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ తన పిటిషన్లో పేర్కంది.

కాగా, రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురి రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి ఆమోద ముద్ర వేశారు. బలనిరూపణ నిర్వహించాలంటే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరిగి రావాలని, అప్పుడే బలనిరూపణ పరీక్షకు అంగీకరిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

ఈ క్రమంలో ఆ 16 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరైనా కాకపోయినా.. నిర్బంధించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. కాగా, ఒక వేళ కోరితే జడ్జీల ముందు ఆ 16 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చేందుకు తాము సిద్ధమని బీజేపీ తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ తెలిపారు. అయితే, కోర్టు అందుకు అంగీకరించలేదు. రెబల్ ఎమ్మెల్యేలు భోపాల్ వెళితే వారిని కాంగ్రెస్ హార్స్ ట్రేడింగ్ చేసే అవకాశం ఉందని రోహిత్గీ తెలిపారు.

తమ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలపైనా తమకు అనుమానాలున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పటికిప్పుడు బలనిరూపణ పరీక్ష చేయకుంటే భూమి బద్దలవడం లాంటి ప్రళయాలు ఏమీ సంభవించమని పేర్కొంది.
కాగా, సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంతో ఆయనకు మద్దతుగా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారంతా

English summary
The Supreme Court on Wednesday said that it is not going to come in the way of the legislature to decide who enjoys the trust. It was hearing the petitions filed by Bharatiya Janata Party (BJP) seeking the trust vote in Madhya Pradesh and the Congress which had opposed it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X