వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం ముందుగా అణ్వాయుధాలను ఉపయోగించం: ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని, తామే ముందుగా అణు ఆయుధాన్ని భారత్‌పై ఉపయోగించమని పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. భారత్‌పై యుద్ధం వస్తే అణుబాంబులు వేస్తామంటూ ఆ దేశ మంత్రి వ్యాఖ్యానించిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

లాహోర్‌లో జరిగిన అంతర్జాతీయ సిక్కుల సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. పాకిస్థాన్, భారత్ రెండూ కూడా అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలే.. భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింతగా కొనసాగితే ప్రపంచమే ప్రమాదంలో పడుతుందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

Won’t use nukes first, says Pakistan Prime Minister Imran Khan

యుద్ధంతో జరిగేది నష్టమే కానీ, మరింకేం లేదని ఆయన అన్నారు. యుద్ధాలు జరగడం వల్ల ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో చరిత్రను చూసి తెలుసుకోవచ్చని అన్నారు. కాగా, ఇటీవల భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి పాకిస్థాన్ మన దేశంపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది.

భారత్‌పై యుద్ధం తప్పేలా లేదంటూ ఇటీవల ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ఇమ్రాన్ యుద్ధం తాము ప్రారంభించమని వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, 125-250గ్రాంల అణుబాంబులను భారత్‌పై వేస్తామంటూ సోమవారం పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

English summary
Pakistan will not use nuclear weapons first and going to war will not solve any problems, its Prime Minister Imran Khan said on Monday even as a minister in his government said the country had “mini atom bombs” that could be used against India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X