Work Hours: దేశంలోని ఏ రాష్ట్ర ప్రజలు ఎక్కువ గంటలు పని చేస్తారు?
Work Hours: భారత్ లో సాధారణంగా రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలు పని చేస్తారు. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎక్కువగా పని చేస్తారని.. కొన్ని రాష్ట్రాలలో తక్కువగా పని చేస్తారని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చేపట్టిన సమయ వినియోగ సర్వే-2019 ద్వారా తెలిసింది. ఆ నివేదిక ప్రకారం భారత్ లోని గుజరాత్ ప్రజలు అత్యధిక గంటలు పని చేస్తారని.. ఇక్క వారు కృషి, అంకితభావంతో పని చేస్తారని సర్వే ద్వారా వెల్లడైంది. బహుశా ఈ కారణంగానే గుజరాత్ దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగంలో ముందున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీహార్ లో చాలా తక్కువ గంటలు పని చేస్తారని ఈ సర్వే ద్వారా తెలిసింది.
గోవా.. స్మార్ట్ వర్క్
మరోవైపు గోవా ప్రజలు చాలా తక్కువ సమయం పని చేస్తారు కానీ ఆర్థికంగా చాలా ముందున్నారని వెల్లడైంది. గోవా 'స్మార్ట్ వర్క్' అనే వ్యూహాన్ని పాటిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడి ప్రజలు తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తారని.. వారు తమ జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారని సర్వేలో కనిపించింది. గోవా సాధించిన ఈ విజయం కేవలం ఎక్కువ పని చేయడం మాత్రమే సరిపోదని.. తెలివిగా పని చేయడం కూడా ముఖ్యమని చూపిస్తోంది.

గ్రామాల్లో నివసించే వారి కంటే నగరాల్లో నివసించే వారు ఎక్కువగా పనిచేస్తున్నారని కూడా నివేదిక వెల్లడించింది. బహుశా నగరాల్లో ఉరుకులు పరుగుల జీవితం, పోటీ దీనికి కారణం కావచ్చు. అదే సమయంలో పురుషులే మహిళల కంటే ఎక్కువగా పని చేస్తారని తెలిసింది. ఇది మన సమాజంలో సాంప్రదాయ ఆలోచనను ప్రతిబింబిస్తుంది. నివేదిక ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ రంగంలోని వారికంటే తక్కువగా పని చేస్తారు. కానీ దీని అర్థం ప్రభుత్వ ఉద్యోగాలు సౌకర్యవంతంగా ఉంటాయని కాదు. ప్రతి ఉద్యోగానికి దాని సొంత సవాళ్లు ఉంటాయి.
పని ఎక్కువ.. ఆదాయం తక్కువ?
ఈ నివేదికలోని కీలక విషయం ఏమిటంటే.. ఎక్కువ పని చేయడం అంటే ఎక్కువ సంపాదించడం కాదు. దీనికి గోవా అతిపెద్ద ఉదాహరణ. ఈ నివేదిక మనం సరైన పద్ధతిలో ఆలోచిస్తున్నామా లేదా అని ఆలోచించేలా చేస్తుంది? మనం ఎక్కువగా పని చేయడంపైనే దృష్టి పెడుతున్నామా లేదా తెలివిగా పని చేయడంపై కూడా దృష్టి పెడుతున్నామా అనే తేలిపోయింది. భారత్ చైనా, మలేషియా, ఫిలిప్పీన్స్ లతో సమానంగా పని చేస్తుందని, కానీ తలసరి జీడీపీ తక్కువగా ఉందని కూడా నివేదిక పేర్కొంది. తక్కువ సమయంలో ఎక్కువ పని చేసి మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు మనం స్మార్ట్ వర్క్ ఆవిష్కరణలు, సాంకేతికతను ఉపయోగించుకోవాలి.
రాష్ట్రాల వారీగా ఇలా..
నివేదిక ప్రకారం.. గుజరాత్ లో 7.2 శాతం మంది ఉద్యోగులు వారానికి 70 గంటలకు పైగా పని చేస్తున్నారు. ఇది భారతదేశంలోనే అత్యధికం. పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ కూడా అధిక పని గంటలు ఉన్న రాష్ట్రాలలో ఉన్నాయి. మరోవైపు బీహార్ లో అతి తక్కువ మంది ఎక్కువ గంటలు పని చేస్తారు. గుజరాత్ కంటే బీహార్ లో అలాంటి వారి సంఖ్య ఏడు రెట్లు తక్కవ.












Click it and Unblock the Notifications