వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2022 నాటికి కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంతోపాటు సెంట్రల్ విస్టా, రాష్ట్రపతి భవన్, కాంపోజిట్ కాంప్లెక్స్‌కు సంబంధించిన ఆధునికీకరణ పనులు వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి వివరాలను వెల్లడించారు.

రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించిన ప్రాంతాన్ని ఆధునికీకరిస్తామని చెప్పారు. పార్లమెంటు భవనాన్ని కొత్తగా నిర్మించడం లేదా ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు కేంద్రమంత్రి స్పందించారు.

Work on redevelopment of Parliament Building, Central Vista may begin by next year: Hardeep Singh Puri

పార్లమెంటు భవనానికి సంబంధించిన స్థలం, డిజైన్ అంశాలు పరిశీలనలో ఉన్నాయమని హర్దీప్ సింగ్ తెలిపారు. త్వరలో డిజైన్‌కు సంబంధించిన టెండర్లు ఖరారు చేస్తామని, వచ్చే సంవత్సరం నుంచి పనులు ప్రారంభమవుతాయన్నారు.

అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కాగా,
2022 నాటికి ఆధునికీకరణ జరిగిన పార్లమెంటు భవనంలోనే వర్షాకాల సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. 2024 నాటికి కొత్త పార్లమెంటును సిద్ధం చేసే ప్రణాళికలు కూడా ఉన్నట్లు సమాచారం. పార్లమెంటులో ఎంపీలకు చాంబర్లు, కార్యాలయాలకు స్థలం కొరత ఉన్న కారణంగానే విస్తరణ, ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.

English summary
The government has decided to give a makeover to Lutyens' Delhi. The Central Vista, the 3-km stretch from Rashtrapati Bhavan, North and South Block up to India Gate will be redeveloped in the project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X