వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు 14 నెలలు కోసం బానిసలా పనిచేశా..! కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 నెలల పాలనలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు బానిసలా పనిచేశానని అన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్‌లతో పాటు ఎమ్మెల్యేలందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌కు ఊడిగం చేసినా తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.

నివురుగప్పిన నిప్పులా కాశ్మీర్.. భద్రత కట్టుదిట్టం.. 3 నెలలకు సరిపడా ఆహారపదార్థాల నిల్వ నివురుగప్పిన నిప్పులా కాశ్మీర్.. భద్రత కట్టుదిట్టం.. 3 నెలలకు సరిపడా ఆహారపదార్థాల నిల్వ

ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన కుమారస్వామి తన మనసులో మాట బయటపెట్టారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే జేడీఎస్‌తో కాంగ్రెస్ చేతులు కలిపిందని చెప్పారు. అలా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా కొందరు స్థానిక నేతలకు ఇది ఇష్టంలేదని కొందరు తనతో చెప్పారని అన్నారు. చాలామంది బహిరంగంగానే ఈ విషయాన్ని వెల్లడించారని అన్నారు.

Worked like a slave for Congress for 14 months says kumaraswamy

జేడీఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల కన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకే తమ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించిందని కుమార స్వామి స్పష్టం చేశారు. అపాయింట్‌మెంట్ లేకుండానే ఎమ్మెల్యేలకు తనను కలుసుకునే అవకాశం కల్పించానని, వారు అడిగిన వెంటనే అన్ని పనులకు ఓకే చెప్పానని అన్నారు. 14 నెలల కాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దానికన్నా ఎక్కువే చేశానని, ఆ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు రూ.19,000కోట్లు కేటాయించానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌తో పొత్తు వద్దని తమ పార్టీ నేతలు చెప్పినా ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నానని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు వెన్నుపోటు పొడుస్తారని జేడీఎస్ ఎమ్మెల్యేలు ముందే చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రిగా గద్దె దిగిన తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానన్న కుమారస్వామి, రాష్ట్రాభివృద్ధికి తాను ఎంతో చేసినప్పటికీ దానిని ఎవరూ గుర్తించకపోవడం ఆవేదన కలిగిస్తోందని వాపోయారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పనిచేస్తారా అన్న ప్రశ్నకు కుమారస్వామి ఆసక్తికర సమాధానం ఇ్చచారు. ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు జేడీఎస్‌లో మెజార్టీ నేతలు సిద్ధంగా లేరంటూనే, కాంగ్రెస్ హైకమాండ్ అందించిన సహకారాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుందన్నారు కుమారస్వామి.

English summary
JDS leader HD Kumaraswamy has said he worked like a slave for its coalition partner Congress during the 14-month tenure of his government in Karnataka but his work was not appreciated by anyone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X