వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుద్దీకరణపై మోడీపై వరల్డ్‌బ్యాంకు ప్రశంసలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కురిపించింది. ఇండియాను మోడీ వెలుగుల బాటలో నడిపించారని ప్రపంచబ్యాంకు అభిప్రాయపడింది. 'విద్యుదీకరణలో ప్రగతి' నివేదికలో మోడీపై ప్రపంచబ్యాంకు ప్రశంసలు కురిపించింది.

2010 నుంచి 2016 వరకు ప్రతి ఏడాది 30 మిలియన్ల జనాభాకి భారత్‌లో విద్యుత్‌ కాంతులు అందించారని ప్రపంచ బ్యాంకు ఈ వారం విడుదల చేసిన 'విద్యుదీకరణలో ప్రగతి' నివేదికలో వెల్లడించింది. 125 కోట్ల జనాభా గల దేశంలో 85 శాతం జనావళికి విద్యుత్‌ సౌకర్యం కల్పించడం అసాధారణమని ప్రపంచబ్యాంకు అభిప్రాయపడింది.

World Bank lauds Modi govt efforts, says India doing well on electrification

2030 వరకల్లా ప్రపంచమంతా విద్యుద్దీకరణ జరగాలనే లక్ష్యాన్ని భారత్‌ ముందుగానే చేరుకుంటుందని ఈ నివేదిక విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే మిగతా 15 శాతం జనాభాకి విద్యుత్‌ సౌకర్యం కల్పించడం కష్టసాధ్యం కావొచ్చని అభిప్రాయపడింది. కొండలు, గుట్టలలతో కూడిన ప్రాంతాలకు విద్యుత్ వెలుగులు అందించడం కొంత ఆలస్యమైనా గడువులోపల భారత్‌ తన లక్ష్యాన్ని చేరుకుంటుందని 'విద్యుదీకరణలో ప్రగతి' నివేదిక తయారు చేసిన ఫోస్టర్ ధీమా వ్యక్తం చేశారు.

దేశంలో విద్యుదీకరణ పథకం అమలు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు కరెంటు కనెక్షన్‌ గల ఇళ్ల ప్రాతిపదికగా తమ రిపోర్టు సాగిందని ఆయన చెప్పారు.
కానీ భారత ప్రభుత్వం అధికారికంగా విద్యుత్‌ కనెక్షన్‌ కల్గిన గృహాలను మాత్రమే లెక్కలోకి తీసుకుందని ఆమె చెప్పారు.

85 శాతం భారత ప్రజలు విద్యుత్‌ సౌకర్యం కల్గి ఉన్నారని తేలగా.. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం అది 80 శాతం కన్నా తక్కువ అని వెల్లడైందని ఫోస్టర్‌ పేర్కొన్నారు.

విద్యుదీకరణలో భారత్‌ చేసిన కృషి ఇంతకుముందు ఏ దేశం చేయలేదని ఆమె అన్నారు. అయినప్పటికీ భారత్‌ పెద్ద దేశం కావడం వల్ల విద్యుదీకరణలో బంగ్లాదేశ్‌, కెన్యాల కంటే వెనుకే నిలిచిందని తెలిపారు. 2020 నాటికి మరో 250 మిలియన్ల జనాభాకి వెలుగు అందించడం ద్వారా సంపూర్ణ భారతానికి విద్యుత్‌ వెలుగులు సొంతమవుతాయని 'విద్యుదీకరణలో ప్రగతి' నివేదిక వెల్లడించింది.

English summary
India is doing "extremely well" on electrification with nearly 85 per cent of the country's population having access to electricity, the World Bank has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X