వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరల్డ్ ఫుడ్ ఇండియా: ఇది 800కేజీల గిన్నిస్ రికార్డ్ కిచిడీ(పిక్చర్స్)

దేశ రాజధానిలో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఫుడ్ ఇండియా వేడుక‌లో 800 కేజీల కిచిడీని త‌యారు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ కిచిడీని పాక శాస్త్ర నిపుణుడు, చీఫ్ షెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ తయారు చేశార

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఫుడ్ ఇండియా వేడుక‌లో 800 కేజీల కిచిడీని త‌యారు చేసి రికార్డు సృష్టించారు. దీన్ని గిన్నిస్ రికార్డు బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ కిచిడీని పాక శాస్త్ర నిపుణుడు, చీఫ్ షెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ తయారు చేశారు.

జాతీయ వంటకంగా 'కిచిడీ'?: నెటిజన్ల రచ్చ, కేంద్రమంత్రి దిగొచ్చారు!జాతీయ వంటకంగా 'కిచిడీ'?: నెటిజన్ల రచ్చ, కేంద్రమంత్రి దిగొచ్చారు!

చేతులేసిన ప్రముఖులు..

ఈ వేడుక‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ కూడా సంజీవ్‌ కపూర్‌ కావడం గమనార్హం. కిచిడీ త‌యారీ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రులు హర్‌సిమ్రత్‌ కౌర్‌, సాధ్వీ నిరంజన్‌, యోగా గురువు బాబా రాందేవ్‌లు కూడా హాజ‌ర‌య్యారు. కిచిడీ తయారీలో వారు కూడా చేతులు కలిపారు.

రికార్డు నేపథ్యంలో పుకార్లు..

ఇటీవ‌ల ఈ రికార్డు నేప‌థ్యంలో కిచిడీని జాతీయ వంట‌కంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందంటూ పుకార్లు వ‌చ్చాయి. అయితే దీనిపై స్ప‌ష్ట‌తనిస్తూ కేంద్ర మంత్రి హ‌ర్ సిమ్ర‌త్ కౌర్ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

భారీ వంటకం..

800 కిలోల కిచిడీని చేసేందుకు సుమారు వెయ్యి లీటర్ల గిన్నెను ఉప‌యోగించారు. కాగా, న‌వంబ‌ర్ 5వ తేదీతో ఈ వ‌ర‌ల్డ్ ఫుడ్ ఇండియా వేడుక ముగియ‌నుంది.

ఇష్టంగా తింటారు..

కాగా, కిచిడీ ఇది ప్రతి భారతీయుడి ఆహారం. పేదలు, ధనికులు ఈ డిష్‌ను ఇష్టంగా సేవిస్తారు. బియ్యం, పప్పు, టమాట, మసాలతో కిచిడీని తయారు చేస్తారు. కిచిడీని జాతీయ వంటగా ప్రకటించే అవకాశాలున్నాయని కూడా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. కానీ, కేవలం రికార్డు కోసం అంత మొత్తంలో కిచిడీని తయారు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు.

English summary
A team of nearly two dozen people cooked over 800kg of khichdi, a traditional rice-dal dish, on Saturday in an attempt to enter Guinness World Records at World Food India fair in Delhi. Yoga guru Baba Ramdev added to the star power at the event by making the ‘tadka’ for the dish at the India Gate lawns where the festival is underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X