వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

World Nurses Day 2020... కరోనా కష్టకాలంలో నర్సుల సేవలకు , ధైర్యానికి సలాం అంటుంది ప్రపంచం

|
Google Oneindia TeluguNews

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం .. ఇక ఈ సందర్భంగానే కాదు, మెడిసిన్ లేని కరోనా వైరస్ పై ఆయుధం లేకుండా పోరాటం సాగిస్తున్నారు నర్సులు. అందుకే వారందరికీ శిరసు వంచి ప్రణమిల్లుతోంది ప్రపంచం. కరోనా బారిన పడిన బాధితులను కాపాడటానికి ఫ్లారెన్స్ నైటింగేల్ లాగా వారు చేస్తున్న సేవలు అనిర్వచనీయం , అభినందనీయం . కరోనా బాధితులకు నిత్యంసేవలు చేస్తున్న వైద్య సిబ్బందిలో నర్సుల పాత్ర చాలా కీలకం . తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వారు సేవలను అందిస్తున్న తీరు నర్సుల పట్ల విపరీతమైన గౌరవాన్ని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారి ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తుంది.

Recommended Video

International Nurses Day : History & Importance Of Nurses Day

కరోనా వారియర్స్ కు జేజేలు .. గాంధీ వైద్య సిబ్బందిపై రేపు హెలికాఫ్టర్ ల ద్వారా పూల వర్షంకరోనా వారియర్స్ కు జేజేలు .. గాంధీ వైద్య సిబ్బందిపై రేపు హెలికాఫ్టర్ ల ద్వారా పూల వర్షం

మానవ సేవే మాధవ సేవగా రోగులకు సేవలు చేస్తున్న నర్సులు

మానవ సేవే మాధవ సేవగా రోగులకు సేవలు చేస్తున్న నర్సులు

ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉంటె అవి సేవామయులైన నర్సుల చేతులే . మానవ సేవే మాధవ సేవ అంటారు. అలా మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్న వారు నర్సులు. అయిన వారు కూడా కొన్ని సందర్భాల్లో ముట్టుకోవటానికి ఇబ్బంది పడినా , మనకు ఏ మాత్రం సంబంధం లేని నర్సులు మాత్రం మనకు సేవలు అందిస్తున్నారు. ఇక ఇప్పటి పరిస్థితి చూసుకుంటే కరోనా అనగానే అల్లంత దూరం పారిపోయే కుటుంబ సభ్యులున్న నేటి రోజుల్లో కరోనా రక్కసి చేతిలో విలవిలలాడుతున్న వారికి నర్సులు అందిస్తున్న సేవలు ఎనలేనివి.

నర్సులు లేని వైద్య సేవలు ... ఆస్పత్రులు ఊహించలేం

నర్సులు లేని వైద్య సేవలు ... ఆస్పత్రులు ఊహించలేం

కుల-మత విబేధాలు లేకుండా , పేద-ధనిక తేడా చూడకుండా, సేవా నిరతితో రోగులకు మేమున్నామంటూ సేవలు అందిస్తున్నారు నర్సులు. ఇక రోగులను ఓదారుస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ, సపర్యలు చేస్తూ, వారికి సమయానికి తగ్గట్టు మందులు ఇస్తూ వారు అందిస్తున్న సేవ నిజంగా కొనియాదదగింది. ఆస్పత్రుల్లో నర్సులు లేనిదే ఎలాంటి వైద్య సేవలు కొనసాగవు అంటే ఆశ్చర్యం లేదు. ఇక అలాంటి నర్సులు నేడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా సమయంలో ఆరి సేవలను ప్రపంచమే గుర్తించింది. వారి సేవా నిరతికి సలాం అంటుంది .

కరోనా మహమ్మారికి వారు బలైపోతున్నా సేవలు చేస్తున్న నర్సులది నిజమైన త్యాగం

కరోనా మహమ్మారికి వారు బలైపోతున్నా సేవలు చేస్తున్న నర్సులది నిజమైన త్యాగం

ఎవరైనా, ఎలాంటి అనారోగ్యం అయినా సరే ఆస్పత్రిలో చేరిన నాటి నుండి ఆరోగ్యంగా కోలుకునే వారు నిరంతరం చేస్తున్న కృషి వర్ణనాతీతం . గాయపడిన క్షతగాత్రులను ప్రేమతో ఆప్యాయంగా ఆదరించి, సేవలందించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ వారసులుగా వారందిస్తున్న సేవలు ప్రశంసించదగినవి . కరోనా మహమ్మారి పంజా విసురుతున్నా, తమకు సైతం కరోనా సోకే ప్రమాదం ఉన్నా, ఇప్పటికే కొంత మంది నర్సులు కరోనాకు బలైనా సరే మొక్కవోని ధైర్యంతో , సేవా దృక్పధంతో సేవలందిస్తున్నారు నర్సులు . వారి త్యాగం గొప్పది .

 ఫ్లారెన్స్ నైటింగేల్ వారసులు .. అందుకోండి ప్రపంచ ప్రజల అభినందనలు

ఫ్లారెన్స్ నైటింగేల్ వారసులు .. అందుకోండి ప్రపంచ ప్రజల అభినందనలు

యూరప్‌లో క్రిమియాన్‌ యుద్ధం జరిగినప్పుడు టర్కిలో యుద్ధంలో క్షతగాత్రులైన సైనికులున్న ప్రాంతానికి వెళ్లి లాంతరు వెలుగులో కూడా వారికి సేవలందించింది ఫ్లారెన్స్ నైటింగేల్ .. ఒక నర్సుగా , మానవ సేవే మాధవ సేవ గా , సేవానిరతి పరమావధిగా జీవనం సాగించిన లేడీ అఫ్ ది ల్యాంప్.. ఫ్లారెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు సందర్భంగా మే 12న ప్రపంచవ్యాప్తంగా నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆమెను స్పూర్తిగా తీసుకుని మందుకు సాగాలని ఈ రోజు నర్సుల దినోత్సవం గా జరుపుతున్నారు. నిజంగా ప్రస్తుత కరోనా కష్టకాలంలో అలాంటి తెగువనే చూపిస్తూ ముందుకు సాగుతున్న ప్రపంచ నర్సులకు వన్ ఇండియా సగర్వంగా సెల్యూట్ చేస్తుంది. యావత్ ప్రపంచమే శిరసు వంచి నమస్కరిస్తుంది.

English summary
Today is International Nurses Day .. Nurses are fighting without a weapon against the corona virus without medicine. That is why the world is bowing down to everyone. Like Florence Nightingale, the services of nurses are vital to the care of corona victims, and the role of nurses in the medical staff serving the corona victims is crucial. The way they serve their lives reminds them of the tremendous respect and importance of the nurses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X